Akhanda 2 OTT: ఓటీటీలోకి ‘అఖండ 2’.. బాలయ్య సూపర్ హిట్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అఖండ 2: తాండవం’. డిసెంబర్ 12న పాన్ ఇండియా రేంజ్ లో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘అఖండ 2: తాండవం’. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 12న పాన్ ఇండియా స్థాయిలో విడుదలైంది. అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. భక్తి, యాక్షన్ మేళవింపుతో తెరకెక్కిన ఈమూవీ బాలయ్య అభిమానులను బాగానే ఆకట్టుకుంది. ఇక సనాతన ధర్మం, ఆధ్యాత్మికతకు సంబంధించిన అంశాలు ఉండడంతో సామాన్య ప్రేక్షకులు కూడా ఈ సినిమాను ఆసక్తిగా తిలకించారు. పలువురు రాజకీయ నాయకులు, స్వామిజీలు కూడా అఖండ 2 సినిమాను చూసి ప్రశంసలు కురిపించారు. ట్రేడ్ నిపుణుల అంచనాల ప్రకారం అఖండ 2 సినిమా రూ. 120 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిందిన తెలుస్తోంది. థియేటర్లలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సంక్రాంతి కానుకగా జనవరి 09 నుంచి అఖండ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఓ అధికారిక ప్రకటన వెలువడనుంది.
బోయపాటి శీను తెరకెక్కించిన అఖండ 2 సినిమాలో సినిమాలో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించారు. బాల మురళీ కృష్ణ పాత్ర తో పాటు అఖండ రుద్ర సికందర్ అఘోరా గా గాడ్ మాస్ మాసెస్ అద్భుతంగా నటించారు. ఇక ఈ మూవీలో సంయుక్త మేనన్ హీరోయిన్ గా నటించింది. బజరంగీ భాయిజాన్ సినిమా ఛైల్డ్ ఆర్టిస్ట్ హర్షాలీ మల్హోత్రా బాలయ్య కూతురి పాత్రలో ఆకట్టుకుంది . అలాగే ఆది పినిశెట్టి, కబీర్ దుల్హన్ సింగ్, సాస్వత ఛటర్జీ, అచ్యుత్ కుమార్, పూర్ణ, , హర్ష, జగపతి బాబు, రచ్చ రవి, అయ్యప్ప తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. తమన్ అందించిన బీజీఎమ్ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.
సంక్రాంతి కానుకగా జనవరి 09 నుంచి స్ట్రీమింగ్..
📢 Streaming Date 🔒#Akhanda2 🔱 (Telugu) streaming from January 9 on Netflix in Telugu , Tamil, Kannada, Malayalam & Hindi 🍿!!#OTT_Trackers pic.twitter.com/UQ6Ldm3DA8
— OTT Trackers (@OTT_Trackers) January 4, 2026
The year 2025 belongs to #Balakrishna the titan of telugu cinema with over ₹300 crore at the box office, he stands as the most bankable senior star, delivering a guaranteed break-even every time. #DaakuMaharaaj#Akhanda2pic.twitter.com/MK0jq1OWwk
— Ved Sagar – 𝑡ℎ𝑒 𝑤𝑎𝑙𝑘𝑚𝑎𝑛 𝑔𝑢𝑦 (@walkman_guy) December 25, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




