Cinema : 17 మంది పిల్లలు రాత్రిపూట పారిపోయి తిరిగి రాలేదు.. ప్రపంచాన్ని వణికించిన సినిమా.. ఓటీటీలోకి హారర్ మూవీ..
ఇటీవల కాలంలో హారర్ త్రిల్లర్ సినిమాలు చూసేందుకు జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. భయానకంగా ఉన్నప్పటికీ ఈ థ్రిల్లర్ మూవీస్ చూసేందుకు ఇష్టపడుతున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సినిమా థియేటర్లలో జనాలను వణికించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా చూసి అడియన్స్ భయపడ్డారు. ఇప్పుడు భారతీయ మూవీ లవర్స్ ముందుకు రాబోతుంది. ఇంతకీ ఈ సినిమా ఏంటో తెలుసుకుందామా. ే

ఓటీటీలో సినిమాలు చూసేవారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుంది. రోటిన్ స్టోరీస్ కాకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లో హారర్ సినిమాలు చూసేందుకు అడియన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈమధ్యకాలంలో ఓటీటీలో పలు సినిమాలు, సిరీస్ లు క్యూ కడుతున్నాయి. ఇందులో గతేడాది ప్రపంచాన్ని వణికించిన హారర్ మూవీ కూడా ఉంది. ఇప్పుడు ఆ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. కానీ అంతకు ముందు ఈ మూవీ జనాలను తెగ భయపెట్టింది. ఆ సినిమా పేరు వెపన్స్. హాలీవుడ్ డైరెక్టర్ జాక్ క్రెగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇందులోని సీన్స్, ట్విస్టులు వణుకుపుట్టించినప్పటికీ సినిమాను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ప్రపంచవ్యాప్తంగా $260 మిలియన్లకు పైగా వసూలు చేసింది. థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ హారర్ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియో హాట్ స్టా్ర్ జనవరి 8 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “మేబ్రూక్ పట్టణంలో చెడు దాగి ఉండగా.. అందరూ సమాధానాల కోసం చూస్తున్నారు. వెపన్స్.. జనవరి 8 నుంచి జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అంటూ రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
కథ విషయానికి వస్తే.. వెపన్స్ సినిమా చిన్న పట్టణ రహస్యం చుట్టూ తిరుగుతుంది. మేబ్రూక్ అనే కల్పిత పట్టణంలో ఒక్కసారిగా 17 మంది పిల్లలు రాత్రిళ్లు తమ మంచం నుంచి పారిపోతారు. ఆ తర్వాత వారు తిరిగి రాలేదు. జూలియా గార్నర్ పాఠశాల తరగతి ఉపాధ్యాయురాలిగా నటించింది. పిల్లల మిస్సింగ్ గురించి తెలుసుకోవడానికి ఆమె ప్రయత్నిస్తుంది. అదే సమయంలో ఊహించని నిజాలు బయటకు వస్తాయి. ఇందులో ఆస్టిన్ అబ్రమ్స్, క్యారీ క్రిస్టోఫర్, బెనెడిక్ట్ వాంగ్ కీలకపాత్రలు పోషించారు. గతేడాది బిగ్గెస్ హారర్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
