Bloody Ishq OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా.. బ్లడీ ఇష్క్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

|

Jul 27, 2024 | 4:54 PM

గతంలో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మూవీస్ లలో ఎక్కువగా కనిపించిన అవికా గోర్ ఈ మధ్యన హారర్ సినిమాలు, సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా ఓటీటీల్లోనే. గతేడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

Bloody Ishq OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేసిన అవికా గోర్ దెయ్యం సినిమా.. బ్లడీ ఇష్క్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Bloody Ishq Movie
Follow us on

 

గతంలో ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మూవీస్ లలో ఎక్కువగా కనిపించిన అవికా గోర్ ఈ మధ్యన హారర్ సినిమాలు, సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది. అది కూడా ఓటీటీల్లోనే. గతేడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా కూడా ఆడియెన్స్ ను బాగాభయ పెట్టింది. ఇప్పుడు మరోసారి ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు వచ్చింది అవికా గోర్. ఆమె నటించిన తాజా చిత్రం ‘బ్లడీ ఇష్క్‌’. బాలీవుడ్ లో హారర్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన విక్రమ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం అందించారు. ఇప్పుడీ సినిమా థియేటర్లలోకి కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో శుక్రవారం (జులై 26) అర్ధరాత్రి నుంచే బ్లడీ ఇష్క్ స్ట్రీమింగ్ అవుతోంది. కాగా అవికా గోర్ కు ఉన్న మార్కెట్ దృష్ట్యా తెలుగులోనూ ఈ సినిమాను స్ట్రీమింగ్ చేస్తారని చాలా మంది భావించారు. అయితే ప్రస్తుతానికి ఓటీటీలో హిందీలో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చింది. త్వరలోనే తెలుగు డబ్బింగ్ వెర్షన్ వస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

బ్లడీ ఇష్క్ సినిమాలో అవికా గోర్, వర్దన్ పూరి, శ్యామ్ కోశోర్, జెన్నిఫర్ పిసినాటో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి మహేశ్ భట్, సుహ్రితా దాస్ కథ అందించారు. షామీర్ టాండన్, ప్రతీక్ వాలియా సంగీతం అందించారు. హరే కృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్టర్స్ పతాకాలపై బ్లడీ ఇష్క్ చిత్రం రూపొందింది. రాకేశ్ జునేజా నిర్మాతగా వ్యవహరించారు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. ఓ ఘటన వల్ల గతం మరిచిపోయిన నేహా (అవికా గోర్)ను స్కాట్‍ల్యాండ్‍లో ఓ ఐల్యాండ్‍ కు తీసుకెళతాడు భర్త రోమేశ్ (వర్దన్ పూరి) తీసుకెళతాడు. అయితే ఆ ఇంట్లో దెయ్యం ఉన్నట్టు నేహా భయపడుతుంది. అంతేకాదు ఆ దెయ్యం నేహాను చంపాలని ప్రయత్నిస్తుంటుంది. అసలు ఆ ఇంట్లో దెయ్యంగా మారింది ఎవరు? నేహాను ఎందుకు చంపాలనుకుంది? తదితర విషయాలు తెలుసుకోవాలంటే బ్లడీ ఇష్క్ సినిమా చూడాల్సిందే అంటున్నారు మేకర్స్.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.