AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..

హిందీలో ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్ తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్స్.. ఇప్పుడు యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్, క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. "రక్త్ బ్రహ్మాండ్.. ది బ్లడీ కింగ్ డమ్ " అనే టైటిల్ పెట్టడం విశేషం.

OTT Movies: ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఎక్కడ స్ట్రీమింగ్ కానుందంటే..
Ott Movie
Rajitha Chanti
|

Updated on: Jul 28, 2024 | 6:57 AM

Share

ఇప్పుడు సినీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సరికొత్త కథలను తీసుకువస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా అన్ని చిత్రాలను పాన్ ఇండియా లాంగ్వేజ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. మరోవైపు సస్పెన్స్, హారర్, కామెడీ, లవ్ ఇలా అన్ని అంశాలతో వెబ్ సిరీస్ రూపొందిస్తున్నారు. ఇప్పుడు తెలుగు దర్శకులు రాజ్ నిడమోరు, కృష్ణ డీకే ఇద్దరు మరో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చేసేందుకు రెడీ అయ్యారు. హిందీలో ఫ్యామిలీ మ్యాన్, ఫర్జీ, గన్స్ అండ్ గులాబ్స్ లాంటి వెబ్ సిరీస్ తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్స్.. ఇప్పుడు యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ నిర్మిస్తున్నారు. ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. కొత్త వెబ్ సిరీస్ అనౌన్స్ చేస్తూ నెట్ ఫ్లిక్స్ రిలీజ్ చేసిన పోస్టర్, క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తున్నాయి. “రక్త్ బ్రహ్మాండ్.. ది బ్లడీ కింగ్ డమ్ ” అనే టైటిల్ పెట్టడం విశేషం.

ఓ కిరీటం, దాని చుట్టూ రక్తం కారుతున్నట్లుగా ఉన్న పోస్టర్ రిలీజ్ చేశారు మేక్ర్స. తొలిసారి ఇలాంటి ఓ యాక్షన్ ఫ్యాంటసీ జానర్ లో వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ వెల్లడించింది. “మీ రక్తాన్ని మరిగించే ఓ పెద్ద న్యూస్ మా దగ్గర ఉంది. మా తొలి యాక్షన్ ఫ్యాంటసీ సిరీస్ ను అనౌన్స్ చేయడానికి చాలా ఆనందిస్తున్నాం” అనే క్యాప్షన్ తో నెట్‌ఫ్లిక్స్ ఈ విషయాన్ని ప్రకటించింది. రాజ్ అండ్ డీకే తమ డీ2ఆర్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఈ సిరీస్ నిర్మిస్తుండగా.. డైరెక్టర్ అనిల్ బార్వే దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఈ సిరీస్ లో ఎవరు నటిస్తున్నారనే విషయం పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఓ రాజ్యం, దాని కిరీటం కోసం జరిగే యుద్ధ నేపథ్యంలో గ్రిప్పింగ్ నెరేటివ్ తో ఈసిరీస్ తెరకెక్కిస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ చెప్పింది. ఇప్పటివరకు ఇలాంటి జానర్ లో కథ అందించలేదని తెలిపింది. త్వరలోనే ఈ సిరీస్ షూటింగ్ కానుండగా.. స్ట్రీమింగ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..