OTT: ఓటీటీలోకి మరో మలయాళ బ్లాక్ బస్టర్.. అద్దిరిపోయే యాక్షన్ సీక్వెన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మలయాళ చిత్రాలకు డిమాండ్ రోజు రోజుకు పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా మలయాళంలో సూపర్ హిట్ అయిన చిత్రాలను ఇతర దక్షిణాది భాషల్లోకి అనువదించి స్ట్రీమింగ్ కు తీసుకొస్తున్నాయి. అలా మరో మలయాళ సినిమా ఇప్పుడు తెలుగులోకి ఓటీటీలోకి వచ్చేసింది.

మంజుమ్మెల్ బాయ్స్, ప్రేమలు, కిష్కింద కాండం.. ఇటీవల తెలుగు ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్న మలయాళ సినిమాలు ఇవి. ముఖ్యంగా ఓటీటీలో మాలీవుడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటోంది. ఈ నేపథ్యంలో ఓటీటీ ఆడియెన్స్ ను అలరించేందుకు మరో మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అదే మహారాజా నటుడు అనురాగ్ కశ్యప్ విలన్ గా నటించిన రైఫిల్ క్లబ్. ఆశిక్ అబు తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ లో తెలుగు నటి వాణీ విశ్వనాథ్ ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. వీరితో పాటు విజయ రాఘవన్, దిలీశ్ పోతన్ తదితరులు ఈ మూవీలో మెరిశారు. గతేడాది డిసెంబర్ 19న థియేటర్లలో విడుదలైన రైఫిల్ క్లబ్ మలయాళ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఉన్ని ముకుందన్ మార్కో, మోహన్ లాల్ నటించిన బరోజ్ 3డీ లాంటి చిత్రాలతో పోటీపడి సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా నిలిచాయి. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ రూ. 35 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. థియేటర్లలో ఆడియెన్స్ ను థ్రిల్ చేసిన రైఫిల్ క్లబ్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. గురువారం (జనవరి17) ఆర్ధరాత్రి నుంచే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మలయాళంతో పాటు, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ రైఫిల్ క్లబ్ సినిమా స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది.
ఈ రైఫిల్ క్లబ్ మూవీకి శ్యామ్ పుష్కరన్, దిలీష్ కరుణాకరణ్, సుహాస్ కథ అందించారు. కేరళలోని వయనాడ్ లో జరిగిన స్టోరీగా ఈ రైఫిల్ క్లబ్ ను తెరకెక్కించారు. ఓ ఆయుధాల డీలర్ల గ్యాంగ్, వయనాడ్ లోని షూటింగ్ క్లబ్ సభ్యుల మధ్య వార్ నడుస్తుంది. ఇందులోని యాక్షన్ సీక్వెన్స్ నెక్ట్స్ లెవెల్ లో ఉన్నాయి. అదే సమయంలో అంతర్లీనంగా కామెడీ కూడా ఆకట్టుకుంది. మరి ఈ వీకెండ్ లో ఓ మంచి యాక్షన్ థ్రిల్లర్ సినిమాను చూడాలనుకుంటున్నారా? అయితే మీకు రైఫిల్ క్లబ్ సినిమా ఒక మంచి ఛాయిస్.
నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్..
Ee clubil, thokkine kaalum unnam nokkinu Watch Rifle Club, now on Netflix!#RifleClubOnNetflix pic.twitter.com/66ADkpdtMa
— Netflix India South (@Netflix_INSouth) January 16, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








