Hero Movie: ఓటీటీలో అడుగుపెట్టనున్న మహేశ్‌ మేనల్లుడి సినిమా.. స్ర్టీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Ashok Galla: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) క‌థానాయ‌కుడిగా పరిచయమైన చిత్రం 'హీరో' (Hero). నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటించింది

Hero Movie: ఓటీటీలో అడుగుపెట్టనున్న మహేశ్‌ మేనల్లుడి సినిమా.. స్ర్టీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే..

Updated on: Feb 03, 2022 | 9:28 PM

Ashok Galla: సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) క‌థానాయ‌కుడిగా పరిచయమైన చిత్రం ‘హీరో’ (Hero). నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా నటించింది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవదాస్ వంటి హిట్‌ చిత్రాలను తెరకెక్కించిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై శ్రీ‌మ‌తి గల్లా పద్మావతి ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన ‘హీరో’ సినిమా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. కామెడీ ఎంటర్‌ టైనర్‌ గా పండగ వేళ బాక్సాఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లనే రాబట్టింది.

కాగా ఇప్పుడు ‘హీరో’ సినిమా డిజిటల్‌ మాధ్యమం వేదికగా సినిమా ప్రియులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈనెల 11 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈసినిమాలో జగపతిబాబు, నరేశ్, కోట శ్రీనివాసరావు, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రంలో అర్జున్ అనే పాత్రలో నటించాడు గల్లా అశోక్‌. మొదటి సినిమానే అయినా నటనా పరంగా మంచి మార్కులు తెచ్చుకున్నాడీ యంగ్‌ హీరో. నిధి అగర్వాల్‌ అందంతో పాటు అభినయపరంగానూ ఆకట్టుకుంది.

Also Read:Nani: మీరు రెండు డేట్లు ఫిక్స్‌ చేస్తే.. మేం ఏడు డేట్లు బ్లాక్‌ చేస్తాం.. తన సినిమాకు ఏడు విడుదల తేదీలను ప్రకటించిన నాని..

Sara Alikhan: అలాంటి పిచ్చి కామెంట్లకి నేను కుంగిపోను.. ట్రోలర్‌కి స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చిన సారా..

AHA Unstoppable: సీక్రెట్‌గా ఎందుకు పెళ్లి చేసుకున్నావ్‌? బాలయ్య ప్రశ్నకు మహేశ్‌ రియాక్షన్‌ చూడండి..