AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aquaman and the Lost Kingdom OTT : ఓటీటీలోకి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఆక్వామాన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..

ఇప్పటికే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. జియో సినిమా ఓటీటీలో ఈ సినిమాను ఫ్రీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

Aquaman and the Lost Kingdom OTT : ఓటీటీలోకి హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్.. ఆక్వామాన్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్..
Aquaman 2
Rajitha Chanti
|

Updated on: May 15, 2024 | 4:44 PM

Share

ఈ ఏడాది సినీ పరిశ్రమకు అంతగా కలిసిరాలేదు. ఈసారి వేసవిలో టాలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీల నుంచి పెద్ద సినిమాలేవి విడుదల కాలేదు. కేవలం ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ మూవీస్ మాత్రమే స్ట్రీమింగ్ అవుతున్నాయి. వారం వారం సరికొత్త కంటెంట్ చిత్రాలు, వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మరో యాక్షన్ థ్రిల్లర్ విడుదలయ్యేందుకు రెడీ అయ్యింది. హాలీవుడ్ మూవీ ఆక్వామాన్ అండ్ ద లాస్ట్ కింగ్డమ్ సినిమా ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి వచ్చేస్తుంది. ఇప్పటికే ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే కేవలం రెంట్ పద్దతిలో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో ఫ్రీగా చూడొచ్చు. జియో సినిమా ఓటీటీలో ఈ సినిమాను ఫ్రీగా అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఈ చిత్రానికి జేమ్స్ వాన్ దర్శకత్వం వహించగా.. ఇందులో జేసన్ మొమొవా కీలకపాత్రలో నటించారు. ఇందులో ఆక్వామాన్ అట్లాంటిస్ రూలర్ గా చూపించారు. నీళ్లలో అత్యంత వేగంగా స్విమ్ చేయడంతోపాటు నీటి లోపల ఉండే జీవులను నియంత్రించే శక్తి కలిగి ఉంటాడు. 2018లో వచ్చిన ఆక్వామాన్ తొలి భాగానికి సీక్వెల్ గా తెరకెక్కించారు ఈ చిత్రాన్నిత.

దాదాపు 21 కోట్ల డాలర్ల భారీ బడ్జెట్ తో నిర్మించగా.. ప్రపంచవ్యాప్తంగా రూ. 43.4 కోట్ల డాలర్లు వసూలు చేసింది. యాక్షన్ చిత్రాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా తెగ నచ్చేసింది. ఇన్నాళ్లు అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంట్ పద్దతిలో అందుబాటులో ఉన్న ఈ సినిమా.. ఇప్పుడు మే 21 నుంచి జియో సినిమాలో ఫ్రీగా స్ట్రీమింగ్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
దురంధర్ మూవీ చూసిన టీం ఇండియా.. వీడియో వైరల్
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
పడుకునే భంగిమను బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చట.. ఎలా అంటే?
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
శ్రేయస్ కంటే రాహుల్ పెద్ద తోపా? ఏకిపారేసిన ఐపీఎల్ టీమ్ ఓనర్
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
ఈ సీక్రెట్ తెలిస్తే చికెన్ సూప్ కోసం హోటల్‌కు వెళ్లనే వెళ్లరు!
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!