
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా… నిత్యం సినీప్రియులకు కావాల్సిన కంటెంట్ తీసుకువస్తుంది. ఇప్పటికే అనేక హిట్ చిత్రాలతోపాటు గేమ్ షోస్, టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా మరో రొమాంటిక్ వెబ్ సిరీస్ తీసుకురాబోతుంది. ఆనందలహరి పేరుతో ఓ కొత్త వెబ్ సిరీస్ తీసుకువస్తున్నట్లు తెలియజేసింది. ఆనంద్, లహరి అనే యువ జంట చుట్టూ తిరిగే కథే ఆనందలహరి. తాజాగా శుక్రవారం ఉదయం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాసేపటి క్రితం విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అమ్మాయి మధ్య జరిగే పెళ్లి, ప్రేమ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. దాదాపు 3 నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ కామెడీ సీన్లతో నవ్వి్తూ సరదాగా సాగిపోయింది.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ట్రైలర్ స్టార్ట్ కాగానే.. ఆనంద్ , లహరి ఇద్దరూ ఓ కౌన్సిలర్ ను కలవడం చూపించారు. తమ మధ్య బంధంలో సమస్యలతో వాళ్లిద్దరూ ఆమె వద్దకు వెళ్తారు. ఇద్దరికి ఇష్టం లేకుండానే పెళ్లి జరగడం.. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది సినిమా. ఉద్యోగం తనకు సరిపడదనుకుని సొంతూరిలో ఉండే అబ్బాయి.. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి సొంతూరి నుంచి వెళ్లిపోవాలనుకునే అమ్మాయి మధ్య పెళ్లి జరిగితే ఎలా ఉంటుందనేది ఈ సిరీస్.
ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..
డైరెక్టర్ సాయి వానపల్లి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. కథ, స్క్రీన్ ప్లే సైతం అతడే అందించాడు. ప్రవీణ్ ధర్మపురి నిర్మించిన ఈ సిరీస్ లో అభిషేక్, భ్రమరాంబిక ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?
ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..