AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anandalahari Trailer: ఈస్ట్ గోదావరి అమ్మాయి.. వెస్ట్ గోదావరి అబ్బాయి.. అదిరిపోయిన ట్రైలర్..

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలోకి మరో రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ రాబోతుంది. కొత్త తరం హీరోహీరోయిన్లతో తెరకెక్కించిన ఈ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ క్రమంలోనే తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. ఈస్ట్ గోదావరి అబ్బాయి.. వెస్ట్ గోదావరి అమ్మాయి ప్రేమ, పెళ్లి, గొడవలతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

Anandalahari Trailer: ఈస్ట్ గోదావరి అమ్మాయి.. వెస్ట్ గోదావరి అబ్బాయి.. అదిరిపోయిన ట్రైలర్..
Anandalahari
Rajitha Chanti
|

Updated on: Oct 11, 2025 | 12:04 PM

Share

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా… నిత్యం సినీప్రియులకు కావాల్సిన కంటెంట్ తీసుకువస్తుంది. ఇప్పటికే అనేక హిట్ చిత్రాలతోపాటు గేమ్ షోస్, టాక్ షోలతో ప్రేక్షకులను అలరిస్తుంది. తాజాగా మరో రొమాంటిక్ వెబ్ సిరీస్ తీసుకురాబోతుంది. ఆనందలహరి పేరుతో ఓ కొత్త వెబ్ సిరీస్ తీసుకువస్తున్నట్లు తెలియజేసింది. ఆనంద్, లహరి అనే యువ జంట చుట్టూ తిరిగే కథే ఆనందలహరి. తాజాగా శుక్రవారం ఉదయం ఈ సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. కాసేపటి క్రితం విడుదలైన ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అమ్మాయి మధ్య జరిగే పెళ్లి, ప్రేమ కాన్సెప్ట్ తో ఈ సిరీస్ ను రూపొందించారు. దాదాపు 3 నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ కామెడీ సీన్లతో నవ్వి్తూ సరదాగా సాగిపోయింది.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

ట్రైలర్ స్టార్ట్ కాగానే.. ఆనంద్ , లహరి ఇద్దరూ ఓ కౌన్సిలర్ ను కలవడం చూపించారు. తమ మధ్య బంధంలో సమస్యలతో వాళ్లిద్దరూ ఆమె వద్దకు వెళ్తారు. ఇద్దరికి ఇష్టం లేకుండానే పెళ్లి జరగడం.. ఆ తర్వాత ఇద్దరి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయనేది సినిమా. ఉద్యోగం తనకు సరిపడదనుకుని సొంతూరిలో ఉండే అబ్బాయి.. ఎలాగైనా ఉద్యోగం సంపాదించి సొంతూరి నుంచి వెళ్లిపోవాలనుకునే అమ్మాయి మధ్య పెళ్లి జరిగితే ఎలా ఉంటుందనేది ఈ సిరీస్.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి : Actor: అమ్మాయిల క్రేజీ హీరో.. రియల్ లైఫ్‏లో సూపర్ స్టార్.. విమానం నడిపే ఏకైక హీరో అతడు..

డైరెక్టర్ సాయి వానపల్లి ఈ సిరీస్ కు దర్శకత్వం వహించగా.. కథ, స్క్రీన్ ప్లే సైతం అతడే అందించాడు. ప్రవీణ్ ధర్మపురి నిర్మించిన ఈ సిరీస్ లో అభిషేక్, భ్రమరాంబిక ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సిరీస్ అక్టోబర్ 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు.

ఇవి కూడా చదవండి : Kantara: 17 ఏళ్ల స్నేహం.. రిషబ్ శెట్టి కోసం కాంతార సినిమాలో ఇలా.. ఈ నటుడు ఎవరో తెలుసా.. ?

తాజాగా విడుదలైన ట్రైలర్ మీరు చూసేయ్యండి.

ఇవి కూడా చదవండి : Baby Movie: అమ్మడు నువ్వేనా ఇలా.. బేబీ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే..

Follow Us
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
పారిజాతం పుష్పాలు 9 రకాలా? కిందపడిన పూలనే పూజలో ఎందుకు వాడాలి..
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
ఓబీసీ రిజర్వేషన్లపై బెంగాల్ సర్కార్ కీలక నిర్ణయం..!
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
అతన్ని పక్కనబెట్టి.. వైభవ్‌ని ఆడించాలా? మీకసలు మైండ్ ఉందా?
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
పిక్నిక్ వచ్చిన లేడీస్.. కార్ వెనుక అదిరిపోయే సెటప్.. కట్‌చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
50 సినిమాల్లో ఒకే హీరోతో 40కి పైగా సినిమాలు.. కట్ చేస్తే
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
శని నక్షత్రం మారుతోంది.. ఈ 4 రాశుల లైఫ్‌లో టఫ్ టైమ్ స్టార్ట్!...
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఈసారి పదో తరగతి ఫలితాల్లో గరిష్ట ఉత్తీర్ణత.. ఇకపై ఫెయిల్ ఉండదు
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
ఇకపై డోర్‌ క్లోజ్ అయినా.. మీరు వందేభారత్‌ ఎక్కవచ్చు.. ఎలా అంటే?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
అమలులోకి కొత్త ఈవీ పాలసీ.. ఎప్పటినుంచంటే..?
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..
Team India: దమ్మున్నోడిని పక్కనపెట్టి, దద్దమ్మలను ఆడిస్తారా..