Pushpa 2 OTT: ఇక ఓటీటీలోనూ రప్పా రప్పా.. కొత్త సీన్లతో కలిపి పుష్ప 2 స్ట్రీమింగ్ .. ఎప్పుడు, ఎక్కడంటే?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలో విడుదలై సుమారు 45 రోజులు కావస్తోంది. అయినా ఇప్పటికీ చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతోంది. దీనికి తోడు ఇటీవల పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ రిలీజైంది.

Pushpa 2 OTT: ఇక ఓటీటీలోనూ రప్పా రప్పా.. కొత్త సీన్లతో కలిపి పుష్ప 2 స్ట్రీమింగ్ .. ఎప్పుడు, ఎక్కడంటే?
Pushpa 2 The Rule Movie

Updated on: Jan 22, 2025 | 12:46 PM

గతేడాది డిసెంబర్ 05న థియేటర్లలో విడుదలైన ‘పుష్ప 2’ సినిమా భారతీయ సినిమా రికార్డులను తిరగరాసేసింది. ఇప్పటికే రూ.1850 కోట్ల గ్రాస్ కలెక్షన్ మార్క్‌ను దాటేసింది. తద్వారా బాహుబలి 2ను అధిగమించి అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్‌ సినిమాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇక ఇటీవలే రిలీజ్ చేసిన పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. కొత్త సీన్లను చూడడానికే థియేటర్లకు పరుగులు తీస్తున్నారు. కాగా పుష్ప 2 సినిమా థియేటర్లలో రిలీజై దాదాపు 45 రోజులు కావస్తోంది. దీంతో ఎప్పుడెప్పుడీ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలో చూద్దామా? అని చాలామంది ఎదురు చూస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే పుష్ప 2 ఓటీటీ రిలీజ్ విషయంలో రూమర్స్ భారీగానే వస్తున్నాయి. థియేటర్లలో విడుదల అయిన 56 రోజుల తర్వాతే డిజిటల్ స్ట్రీమింగ్‌ అవుతుందని ఇదివరకే మేకర్స్‌ ప్రకటించారు. దీంతో పుష్ప 2 ఓటీటీ రిలీజ్ కు సమయం ఆసన్నమైందని తెలుస్తోంది.

 

ఇవి కూడా చదవండి

పుష్ప 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకు సొంతం చేసుకుంది. సుమారు రూ. 200 కోట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసిందని నెట్టింట వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో థియేట్రిలక్ రిలీజ్ అయిన ఏడువారాల తర్వాత పుష్ప 2 సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకొచ్చేలా డీల్ చేసుకున్నారట.

ఈ లెక్కన చూసుకుంటే జనవరి 29న లేదా 31న పుష్ప2 సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని తెఉలస్తోంది. కాగా పుష్ప2 రీలోడెడ్‌ వెర్షన్‌ సుమారు 3:40 నిమిషాల నిడివి ఉంది. ఓటీటీలో ఈ కొత్త వెర్షన్‌ను స్ట్రీమింగ్ చేయనున్నారు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్,రష్మిక మందన్నా జోడీకి మంచి పేరొచ్చింది. వీరితో పాటు ఫాహద్ ఫాజిల్, రావు రమేశ్, జగపతి బాబు, సునీల్, అనసూయ, జగదీశ్ వంటి స్టార్ నటీనటులు ఈ చిత్రంలో మెరిశారు భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీప్రసాద్ స్వరాలు అందించారు.

 

1850 కోట్ల కు పైగా కలెక్షన్లు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.