బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌ను నటించిన సినిమా ఓ మై గాడ్ 2. లైంగిక విద్య ఆవశ్యకతపై తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ‘OMG 2’ సెన్సార్ సమస్యను ఎదుర్కొంది. సినిమాలోని చాలా సన్నివేశాలు, డైలాగ్‌లకు సెన్సార్ బోర్డ్ కత్తెర వేసింది. మొత్తం 27 కట్స్ తో పాటు 25 మార్పులు సూచించారు. చివరకు ఈ సినిమాకు A సర్టిఫికేట్ ఇచ్చారు. దీంతో అక్షయ్ కుమార్ సహా చిత్రబృందం సెన్సార్ బోర్డుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అన్ని అవాంతరాలు దాటి ఆగస్ట్ 11న థియేటర్లలో విడుదలైన ఓ మై గాడ్ 2 పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఓ మైగాడ్ 2 సినిమాను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఆదివారం (అక్టోబర్ 8) నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ఓటీటీ ఆడియెన్స్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఒకరోజు ముందుగానే ఓమైగాడ్ సినిమాను డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఒక వీడియోను రిలీజ్ చేశారు హీరో అక్షయ్ కుమార్
‘OMG 2’ సినిమా OTT వెర్షన్‌పై కూడా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయని వార్తలు వచ్చాయి. ఓటీటీలో కూడా సరిగ్గా 27 కట్స్‌తో సినిమా విడుదల అయ్యిందని తెలిసింది. ఓ మై గాడ్ 2 ఓటీటీ రిలీజ్‌పై అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘నాకు ఫైట్ చేయడం లేదా ఫైట్ చేయడం ఇష్టం లేదు. నాకు రూల్స్ గురించి తెలియదు, రూల్ బుక్ ఎప్పుడూ చదవను. ఇది అడల్ట్ సినిమా అని అనుకుంటే మనం ఏమీ చేయలేం. చాలా మందికి సినిమా చూపించాం, సినిమా అందరికీ నచ్చుతుంది. యువత కోసం ఈ సినిమా చేశాం. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. అందుకు చాలా సంతోషంగా ఉంది’ అని చెప్పుకొచ్చారు. కాగా లైంగిక విద్య ఆవశ్యకతను వివరిస్తూ ‘OMG 2’ ను తెరకెక్కించారు డైరెక్టర్ అమిత్ రామ్. అక్షయ్ శివుడి దూతగా కనిపించగా, ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి శివ భక్తుడి పాత్రలో కనిపించారు. యామీ గుప్తా, పంకజ్ మల్హోత్రా తదితరులు ఈ చిత్రంలో నటించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.