Thegimpu OTT: ఓటీటీలోకి వచ్చేసిన అజిత్ బ్లాక్ బస్టర్ సినిమా ‘తెగింపు’.. ఎక్కడ చూడొచ్చంటే?
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అజిత్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తికావడంతో మంగళవారం (ఫిబ్రవరి 7) అర్ధరాత్రి నుంచి తెగింపు స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ప్రసారమవుతోంది.
తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్ హీరోగా వచ్చిన లేటెస్ట్ సినిమా తునివు. హెచ్ వినోధ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో తెగింపు పేరుతో వచ్చింది. మంజు వారియర్ హీరోయిన్‌గా కనిపించింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ రేంజ్‌లో ఉండడం, దీనికి అజిత్ ఇమేజ్ తోడు కావడంతో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. కాగా థియేటర్లలో అదరగొట్టిన అజిత్ తెగింపు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడీ నిరీక్షణ ఫలించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ అజిత్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ పూర్తికావడంతో మంగళవారం (ఫిబ్రవరి 7) అర్ధరాత్రి నుంచి తెగింపు స్ట్రీమింగ్ అవుతోంది. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ప్రసారమవుతోంది. మరి థియేటర్లలో అజిత్ యాక్షన్ డ్రామాను చూడలేని వారు ఎంచెక్కా ఇంట్లో కూర్చొని తెగింపు సినిమాను చూసేయండి.
కాగా తెగింపు చిత్రాన్ని ప్రముఖ అగ్ర నిర్మాత బోనీ కపూర్ రూపొందించారు. జిబ్రాన్ అందించిన పాటలు, బీజీఎమ్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. ఇందులో సముద్రఖని, అజయ్, జాన్ కొక్కెన్ ప్రధాన పాత్రలు పోషించారు. కాగా దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వరల్డ్ వైడ్ గా సుమారు రూ.250 కోట్లు రాబట్టినట్లు సమాచారం.
If currency notes looked like this, we’re here to say that money CAN buy happiness!??
Thunivu is now streaming in Tamil, Telugu, Malayalam, Kannada and Hindi on Netflix!? #ThunivuOnNetflix
?: @CassettePada pic.twitter.com/j8aHycYu66
— Netflix India South (@Netflix_INSouth) February 8, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..