త్వరలో ఇండియన్ ఐడల్ సీజన్ 4.. టాలెంటెడ్ సింగర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఆడిషన్స్ ఓపెన్..

డిజిటల్‌ రంగంలో 100 శాతం వినోదాన్ని అందించడమే లక్ష్యంగా ముందుకు వెళుతోంది ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా . ఇందులో భాగంగా ఇప్పటికే ఎన్ని సూపర్‌హిట్‌ సినిమాలు, థ్రిల్లింగ్ సస్పెన్స్ వెబ్ సిరీస్‏లను సినీ ప్రియులకు అందించింది. అలాగే అన్‌స్టాపబుల్‌ అంటూ టాక్‌షోలు, తెలుగు ఇండియన్‌ ఐడల్‌ సింగర్‌ సింగింగ్‌ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది.

త్వరలో ఇండియన్ ఐడల్ సీజన్ 4.. టాలెంటెడ్ సింగర్స్‌కు గోల్డెన్ ఛాన్స్.. ఆడిషన్స్ ఓపెన్..
Telugu Indian Idol Season 4

Updated on: Jul 08, 2025 | 10:29 AM

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు, ప్రేమికుల నుంచి ప్రశంసలు పొందిన సింగింగ్ రియాలిటీ షో ‘ఆహా తెలుగు ఇండియన్ ఐడల్’. ఇప్పటికే రెండు సీజన్స్‌తో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన ఈ రియాలిటీ షో మూడో సీజన్ కోసం రెడీ అవుతుంది. ఆహా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 4 కోసం ఎదురు చూస్తోన్న ప్ర‌యాణం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ఆహాలో సూపర్ హిట్ అయిన సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్. ఎంతో టాలెంట్ ఉండి నిరూపించుకోవడానికి ఒక వేదిక కోసం ఎదురుచూసే యంగ్ సింగర్స్ కోసం ఈ షోను తీసుకువచ్చారు నిర్వాహకులు. సింగర్ శ్రీరామచంద్ర హోస్ట్ గా.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, హీరోయిన్ నిత్యామీనన్, సింగర్ కార్తీక్ జడ్జీలుగా వ్యవహరించిన సీజన్ 1 పెద్ద సక్సెస్ అయిన సంగతి తెలిసిందే. ఆతర్వాత ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ఇండియ‌న్ ఐడ‌ల్ 2కు వ‌చ్చిన అపూర్వ‌మైన స్పంద‌న‌వచ్చింది.

ఇది కూడా చదవండి : అప్పుడు ఆవేశంలో ఆత్మహత్య చేసుకుందామనుకుంది.. కట్ చేస్తే ఇప్పుడు స్టార్ హీరోయిన్

అలాగే సీజన్ 3కూడా అంతే పెద్ద విజయం సాధించింది. ఇక ఇప్పుడు సీజన్ 4కు సమయం వచ్చింది. మరి ఈ సీజన్ ఎలా ఉండబోతోంది. సెలెక్షన్స్ ఎలా జరగబోతున్నాయి..హోస్ట్ ఎవరు, జడ్జెస్ ఎవరూ ఏ సెలెబ్రిటీ వచ్చి ఈ సీజన్ ని గ్రాండ్ లాంచ్ చేస్తారో అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :బాబోయ్.. ! ఈ ఫొటోలో ఉంది ఆ స్టార్ హీరోయినా..!! అస్సలు ఊహించలేరు గురూ..

ఈ క్రమంలోనే ఆన్ లైన్ ద్వారా ఆడిషన్స్ ను నిర్వహిస్తుంది ఆహా. ఆన్ లైన్ ఆడిషన్స్ ఓపెన్ అయ్యాయి అని తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు ఇండియన్ ఐడల్ టీమ్. సీజన్ 4కు కూడా తమన్, సింగర్ కార్తీక్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు మరో జడ్జ్ కూడా ఉండనున్నారు. ఇక ఆన్ లైన్ ఆడిషన్స్ ఓపెన్ అవ్వడంతో టాలెంటడ్ సింగర్స్ అందరూ తమ ప్రతిభను కనబరచడానికి రెడీ అయ్యారు. మారేందుకు ఆలస్యం.. మీలోనూ మంచి సింగర్ దాగి ఉంటే వెంటనే ఈ ఆన్ లైన్ ఆడిషన్స్ లో పాల్గొని సింగర్స్ గా వేదిక పై అదరగొట్టండి.

ఇది కూడా చదవండి : అతను నా శరీరంలో అక్కడ చెయ్యివేశాడు.. పోలీసులకు చెప్తే ఇలా అన్నారు.. షాకింగ్ విషయం చెప్పిన హీరోయిన్

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..