Indian Idol Season 4: హైదరాబాద్‏లో ప్రారంభమైన ఇండియన్ ఐడల్ గ్రౌండ్ ఆడిషన్స్.. వేదిక వివరాలివే

మీకు సింగింగ్ అంటే ఆసక్తి ఉందా ?ప్రొఫెషనల్ సింగర్ గా మంచి భవిష్యత్ కోరుకుంటున్నారా?అయితే మీకోసమే ఈ గోల్డెన్ ఛాన్స్. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా సింగింగ్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ మన హైదరాబాద్ లో ప్రారంభమయ్యాయి.

Indian Idol Season 4: హైదరాబాద్‏లో ప్రారంభమైన ఇండియన్ ఐడల్ గ్రౌండ్ ఆడిషన్స్.. వేదిక వివరాలివే
Aha Telugu Indian Idol Season 4

Updated on: Aug 03, 2025 | 6:01 PM

సరైన వేదికలు కల్పించి టాలెంట్ ను ప్రోత్సహించడంలో ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఎప్పుడూ ముందుంటుంది. ఇందులో భాగంగానే తెలుగు ఇండియన్ ఐడల్ ద్వారా ఎంతో మంది సింగర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. వీరిలో చాలా మంది సినిమాల్లో పాటలు పాడుతూ గాయనీ గాయకులుగా సత్తా చాటుతున్నారు. ఇప్పుడు మరికొంత మందిని ఔత్సాహిక సింగర్లకు తమ ట్యాలెంట్ చాటుకోవడానికి మరో అవకాశమిస్తోంది. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు సీజన్ 4 రాబోతుంది.
ఇందు కోసం గత కొన్ని రోజులుగా ఆన్ లైన్ లో ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అలాగే యూఎస్ ఆడిషన్స్ కూడా పూర్తయ్యాయి. వీటిలో ఎంపికైన గాయకులు గోల్డెన్ టికెట్ పోటీ పడతారు.ఇప్పుడు ఆఫ్ లైన్ లో ఆడిషన్స్ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని ట్యాలెంటెడ్ సింగర్ల కోసం హైదారాబాద్ లో గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహిస్తోంది. జేఎన్ టీయూ హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రిషి ఎమ్.ఎస్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో సింగింగ్ పోటీలు జరుగుతున్నాయి. సింగింగ్ పై ఫ్యాషన్ ఉన్న సింగర్స్ ఈ ఆడిషన్స్ లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆహా ప్రకటించింది. ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ కు తమన్, సింగర్ కార్తీక్, గీతా మాధురి జడ్జ్ లుగా ఉండనున్నారు. వీరితో పాటు మరొకరు జడ్జ్ గా రానున్నారని తెలుస్తోంది. త్వరలోనే కొత్త సీజన్ గురించి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

పవన్ కల్యాణ్ లో ‘ఓజీ’ లో పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ సింగర్స్

కాగా ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 పార్టిసిపెంట్స్ నజీర్, భరత్ రాజ్ త్వరలో రాబోతున్న ఓజీ చిత్రంలోని పాటకు తమ గాత్రాన్ని అందించారు. పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకులు తమన్ సంగీత సారథ్యం వహించారు. తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా వ్యవహిరిస్తున్న ఆయన సీజన్ 3 వేదికగా నజీర్, భరత్ రాజ్ అవకాశం ఇస్తానని మాటిచ్చారు. అందులో భాగంగానే తాజాగా విడుదలైన ఫైర్ స్ట్రామ్ పాటలో అవకాశం కల్పించారు. మరోవైపు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 కు సంబంధించి ఏర్పాట్లు చకచక జరుగుతున్నాయ్. అందులో భాగంగానే ఆడిషన్స్ జరుపుతున్నారు. ఇప్పటికే యూఎస్ ఆడిషన్స్ పూర్తయ్యాయి. వీటిలో ఎంపికైన గాయకులు గోల్డెన్ టికెట్ పోటీ పడతారు.

ఇవి కూడా చదవండి

అడ్రస్ వివరాలివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.