OG Movie: మాట నిలబెట్టుకున్న తమన్.. పవన్ కల్యాణ్ ఓజీలో పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్

ట్యాలెంట్ ను వెలికి తీసేందుకు సరైన వేదికలు కల్పించడంలో ఆహా ఓటీటీ ఎప్పుడూ ముందుంటుంది. ముఖ్యంగా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ షో ద్వారా ఎంతో మంది ట్యాలెంటెడ్ సింగర్లను ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ క్రమంలోనే ఇండియన్ ఐడల్ సీజన్ 3లో పాల్గొన్న ఇద్దరు సింగర్లకు పవన్ ఓజీ మూవీలో పాడే అవకాశం దక్కించుకున్నారు.

OG Movie: మాట నిలబెట్టుకున్న తమన్.. పవన్ కల్యాణ్ ఓజీలో పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సింగర్స్
Aha Telugu Indian Idol

Updated on: Aug 03, 2025 | 5:40 PM

ఒకప్పుడు ఇండియన్ ఐడల్ లాంటి సింగింగ్ ట్యాలెంట్ హంట్ షో లు ఎక్కువగా హిందీలోనే కనిపించేవి. అయితే ఇదే షోను తెలుగులోనూ  పరిచయం చేసింది ఆహా ఓటీటీ. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది సినీ ప్రియులు, సంగీత ప్రియులు మెచ్చిన ఈ సింగింగ్ రియాల్టీ షో ఇప్పటికే సక్సెస్ ఫుల్ గా మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో సీజన్ కోసం రెడీ అవుతోంది. ఇందుకోసం యూఎస్ లో ఆడిషన్స్ కూడా నిర్వహించింది. అలాగే ఆన్ లైన్ లోనూ ఆడిషన్స్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు హైదరాబాద్ లోనూ గ్రౌండ్ ఆడిషన్స్ ను కూడా నిర్వహిస్తోంది. తెలుగు ఇండియన్ ఐడల్ షో ద్వారా ఇప్పటికే ఎంతో మంది యంగ్ సింగర్స్ తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడిప్పుడే సినిమాల్లో పాటలు పాడుతూ గాయనీ గాయకులుగా ఎదుగుతున్నారు. ఇందుకు మరో ఉదాహరణే.. నజీర్, భరత్ రాజ్. ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లో కంటెస్టెంట్స్ గా పాల్గొన్న వీరి గానానికి షో జడ్జి, సంగీత దర్శకుడు ఫిదా అయిపోయారు. తన సినిమాల్లో పాటలు పాడే అవకాశం కల్పిస్తానని మాటిచ్చారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు తమన్. అందులో భాగంగానే తాజాగా విడుదలైన ఓజీ ఫైర్ స్ట్రామ్ సాంగ్ లో నజీర్, భరత్ రాజ్ లకు అవకాశం కల్పించారు.   ఈ సాంగ్ ని శింబు, తమన్ తో పాటు నజీర్, భరత్ రాజ్ లు కూడా పాడారు. సాంగ్ టైటిల్స్ లో వారి పేర్లు కూడా చేర్చారు. శనివారం (ఆగస్టు 02) సాయంత్రం విడుదలైన ఓజీ ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఎప్పటిలాగే తమన్ తన బీజీఎమ్ తో అదరగొట్టారు.

త్వరలోనే నాలుగో సీజన్ ప్రారంభం..

మరోవైపు ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4కు సంబంధించిన ఏర్పాట్లు శర వేగంగా జరుగుతున్నాయి.  ఇప్పటికే యుఎస్ ఆడిషన్స్ విజయవంతంగా ముగిశాయి. ఇటీవలే ఆన్ లైన్ ఆడిషన్స్ కూడా నిర్వహించారు.  ఇప్పుడు ఆఫ్ లైన్ లో ఆడిషన్స్ ఏర్పాటు చేశారు.  తెలుగు రాష్ట్రాల్లోని ట్యాలెంటెడ్ సింగర్ల కోసం హైదారాబాద్ లో గ్రౌండ్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. జేఎన్ టీయూ హైదరాబాద్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న రిషి ఎమ్.ఎస్ ఇన్‏స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజీలో సింగింగ్ పోటీలు జరుగుతున్నాయి. ఎంపికైన గాయకులు త్వరలోనే గోల్డెన్ టికెట్ పోటీలో తలపడనున్నారు.  సింగింగ్ పై ఫ్యాషన్ ఉన్న సింగర్స్ ఈ ఆడిషన్స్ లో పాల్గొని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని ఆహా ప్రకటించింది.

ఇవి కూడా చదవండి

హైదరాబాద్ లో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 ఆడిషన్స్.. వివరాలివే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.