Aha OTT: ‘సీఎం పీకే’.. ఆహా ఓటీటీలో మరో పవర్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ షో.. పూర్తి వివరాలివే

100 పర్సెంట్ లోకల్ కంటెంట్ అంటూ తెలుగు వారికి బాగా చేరువైపోయింది ఆహా ఓటీటీ. ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఆడియెన్స్ మెప్పిస్తోన్న ఆహా ఓటీటీ రియాలిటీ షోస్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

Aha OTT: సీఎం పీకే.. ఆహా ఓటీటీలో మరో పవర్ ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ షో.. పూర్తి వివరాలివే
Aha OTT

Updated on: Feb 09, 2025 | 5:00 PM

తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ అందిస్తూ ఓటీటీ రంగంలో జెట్ స్పీడ్ లో ఆహా దూసుకుపోతుంది. చిన్నారులు, పెద్దలు ఇష్టపడే కంటెంట్ చిత్రాలను అందించడంతో పాటు ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులోకి డబ్ చేసి మరీ స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. ఇక రియాలిటీ షోస్ లోనూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బాలకృష్ణ అన్ స్టాపబుల్ కానీ, తెలుగు ఇండియన్ ఐడల్ కానీ, డ్యాన్స్ ఐకాన్ తదితర రియాలిటీ షోస్ తెలుగు ఓటీటీ ఆడియెన్స్ ను ఎంతగానో మెప్పించాయి. ఓటీటీ చరిత్రలో మునుపెన్నడూ లేని సరికొత్త ప్రోగ్రామ్స్ అందిస్తూ డిజిటల్ ప్రేక్షకులను మంత్రముగ్దుల్ని చేస్తోన్న ఆహా ఐదో వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా మరో కొత్త ఎంటర్ టైన్మెంట్ ప్రోగ్రామ్ ను అనౌన్స్ చేసిందీ తెలుగు ఓటీటీ సంస్థ. సీఎం పీకే పేరుతో ది మోస్ట్ పవర్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ షోను ప్రకటించింది. త్వరలో ఆహాలో ఈ షో స్టార్ట్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

అయితే సీఎం పీకే అన్నది సినిమానా, రియాలిటీ షోనా లేదా వెబ్ సిరీసా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఓటీటీ ఆడియెన్స్, నెటిజన్లు తమకు నచ్చినట్లు ఊహించుకుంటున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి ఆహా షోకు వస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. అలాగే పవన్ కల్యాణ్ పొలిటికల్ జర్నీ నేపథ్యంలో ఈ షో ఉండవచ్చిని మరికొందరు ఊహించుకుంటున్నారు. అయితే సీఎం పీకే అనేది ఆహా కొత్త ఒరిజినల్స్ అని, ఇందులో వేరే నటీనటులు ఉండవచ్చని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఐదో వార్షికోత్సవం స్పెషల్..

త్వరలోనే డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.