Tamannah: మిల్కీబ్యూటీ తమన్నా ధరించే డ్రెస్సుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

మిల్కిబ్యూటీ తమన్నా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. మొదటి సినిమా 'శ్రీ'.. ఆశించినంత విజయం సాధించకపోయినా.. ఈ అమ్మడికి మాత్రం ఆఫర్లను

  • Rajitha Chanti
  • Publish Date - 5:41 pm, Sat, 10 April 21
Tamannah: మిల్కీబ్యూటీ తమన్నా ధరించే డ్రెస్సుల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Tamannah

మిల్కిబ్యూటీ తమన్నా.. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. మొదటి సినిమా ‘శ్రీ’.. ఆశించినంత విజయం సాధించకపోయినా.. ఈ అమ్మడికి మాత్రం ఆఫర్లను తీసుకువచ్చింది. ఇక ఆ తర్వాత 2007లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన హ్యాపీడేస్ సినిమాతో మిల్కీబ్యూటీ రేంజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమా తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్, రచ్చ, బాహుబలి వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి టాప్ స్టార్‏గా ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులోనే కాకుండా.. అటు తమిళం, హిందీలలో కూడా వరుస సినిమాలను చేస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు యంగ్ హీరో సత్యదేవ్ సరసన గుర్తుందా శీతాకాలం సినిమాతోపాటు, గోపీచంద్‏కు జోడీగా సీటీమార్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎఫ్ 3 సినిమాలోనూ నటిస్తుంది. అంతేకాకుండా.. నితిన్ నటిస్తున్న అంధాదున్ తెలుగు రీమేక్‏లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. కేవలం సినిమాలే కాకుండా డిజిటల్ మీడియాలోనూ ఈ భామ తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 11th అవర్ అనే వెబ్ సిరీస్‏లో నటించింది తమన్నా. ఈ సిరీస్ ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‏లో తమన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా తన అభిమానులతో టచ్‏లో ఉంటుంది. ఇక పలు ఛానల్స్‏కు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చేస్తుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తమన్నా ధరించిన డ్రెస్సుల మీద ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు నెటిజన్లు. తాజాగా ఈ మిల్కీబ్యూటీ.. లేత గులాబీ రంగులోని పర్పుల పువ్వుల ఫ్రాక్‏లో అందంగా ముస్తాబైంది. ఇక ఈ డ్రెస్సును ధరించిన తమన్నా ఇది సమ్మర్ అనుభూతి అంటూ ఓ వీడియోను తన ఇన్‏స్ట్రాగామ్‏లో షేర్ చేసుకుంది. ఇది చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందింస్తున్నారు. అయితే ప్రస్తుతం తమన్నా ధరించిన డ్రెస్ ఖరీదు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‏గా మారింది. ఆ ఫ్రాక్ ధరెంత అంటూ చర్చ జరుగుతుంది. ఇక తమన్నా డ్రెస్సును ప్రముఖ స్టైలిస్ట్ సుకృతి గ్రోవర్ రూపొందించింది. దీని ధర అక్షరాల రూ.51,244 అన్నమాట. ప్రముఖ ఆస్ట్రేలియన్ బ్రాండ్ వెబ్ సైట్‏లో దీనిని ఫెమ్ రాప్సోడి 2021 అని ఉంటుంది.

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

ఇక ఇంతకు ముందు సమంత స్కై బ్లూ కలర్ సమ్మర్‏ డ్రెస్సులో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. రెడీ, సెట్, గో అంటూ క్యాపన్ జోడించింది. ఆ ఫోటోలను తమన్నా విభిన్న ట్రెండీ డ్రెస్సులో ఉండడంతో నెటినజ్లు ఆసక్తి కనబరిచారు. ఆ డ్రెస్ ఖరీదు రూ.20,500. అది APZ లేబుల్‏కు సంబంధించింది.

Tamannah 1

ట్వీట్..

 

View this post on Instagram

 

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

ఇక తమన్నా నటించిన వెబ్ సిరీస్ 11th అవర్ విషయానికి వస్తే.. మగవాళ్ళ వ్యాపారం సామ్రాజ్యంలోకి ఓ మహిళ ప్రవేశించి.. వారిని ధీటుగా ఎలా ఎదుర్కోందనే నేపథ్యంలో దీనిని తెరకెక్కించారు. ఇందులో తమన్నా అరాత్రికా రెడ్డి అనే పాత్రలో నటించింది. ఇందులో అరుణ్ ఆదిత్, వంశీ కృష్ణ, రోషిణి ప్రకాష్, జయప్రకాష్, శత్రు, మధుసూదన్ రావు, పవిత్ర లోకేష్, అనిరుధ్ బాలాజీ, శ్రీకాంత్ అయ్యంగార్, వినయ్, ప్రియా బెనర్జీ తదితరులు కీలకపాత్రలో నటించారు.

Also Read: Pushpa Teaser: “తగ్గేదే లే” అంటున్న అల్లు అర్జున్.. రికార్డులు బద్దలు కొట్టుకుంటూ.. దూసుకుపోతున్న పుష్ప టీజర్