టాలీవుడ్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమానే కాకుండా.. సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న జైలర్ చిత్రంలోనూ ఈ మిల్కీ బ్యూటీ కనిపించనుంది. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఇవే కాకుండా.. అటు ఓటీటీలోనూ బ్యాక్ టూ బ్యాక్ వెబ్ సిరీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంది తమన్నా. తాజాగా ఆమె నటించిన కొత్త సిరీస్ జీ కర్దా స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూన్ 15 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ మేరకు వీడియో విడుదల చేశారు మేకర్స్.
స్నేహం ప్రధాన ఈ సిరీస్ తెరకెక్కించారు. బాల్యం నుంచి జీవితంలో స్థిరపడే వరకు ఏడుగురి మిత్రుల ప్రయాణం చుట్టూ అల్లుకున్న కథే జీ కర్దా. దీనికి డైరెక్టర్ అరుణిమ శర్మ దర్శకత్వం వహించగా.. ఈ సిరీస్ లో ఆషిమ్, సుహైల్ నాయర్, అన్యా సింగ్, హుస్సేన్ తదితరులు పోషించారు.
ఓవైపు వెండితెరపై.. మరోవైపు డిజిటల్ వేదికపై బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరిస్తుంది తమన్నా. ఇప్పటికే ‘11th అవర్’, ‘నవంబర్ స్టోరీ’ వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను అలరించింది తమన్నా. టైటిల్ ఖరారు కానీ మరో వెబ్ సిరీస్ చేస్తున్నారు.
7 childhood besties, 7 unbreakable bonds, 1 incredible journey!
watch #JeeKardaOnPrime, June 15@tamannaahspeaks #AashimGulati @suhailnayyar #AnyaSingh #ArunimaSharma #HomiAdajania #DineshVijan @SachinJigarLive @MaddockFilms @TSeries pic.twitter.com/obQeOR18dE
— prime video IN (@PrimeVideoIN) June 2, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.