Regina Movie: ఓటీటీలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..
నిజానికి ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అందుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ రెజీనాకు అనుకున్న స్థాయిలో మాత్రం స్క్రీన్స్ దొరకలేదు. దీంతో కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేయగా..అక్కడ డిజాస్టర్ అయ్యింది. దీంతో మిగతా భాషల్లో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్.
టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు నటించిన రాజ రాజ చోర సినిమాతో కథానాయికగా పరిచయమైంది సునైన. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ బ్యూటీ నటించిన లేటేస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రెజీనా. ఈ సినిమా తమిళ్ వెర్షన్ గతేడాది జూన్ 23న థియేటర్లలో రిలీజ్ అయ్యింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. నిజానికి ఈ మూవీని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదల చేయాలనుకున్నారు మేకర్స్. అందుకు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ రెజీనాకు అనుకున్న స్థాయిలో మాత్రం స్క్రీన్స్ దొరకలేదు. దీంతో కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేయగా..అక్కడ డిజాస్టర్ అయ్యింది. దీంతో మిగతా భాషల్లో రిలీజ్ చేయాలన్న ఆలోచనను విరమించుకున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు మేకర్స్.
ఇదివరకే రెజినా తమిళ్ వెర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. ఇక ఇప్పుడు తెలుగు వెర్షన్ కూడా ఓటీటీలో రిలీజ్ చేశారు. థియేటర్లలో విడుదలైన ఎనిమిది నెలల తర్వాత తెలుగు వెర్షన్ ను ఓటీటీలో అందుబాటులోకి తెచ్చారు. ఈ చిత్రానికి డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించగా.. అనంత్ నాగ్ కీలకపాత్ర పోషించారు. ఇందులో సునైన ప్రధాన పాత్ర పోషించింది. భర్త మరణంపై ఓ మహిళ ఎలా ప్రతీకారణం తీర్చుకుంది అన్నదే ఈ సినిమా కథ. ఈ మూవీలో ఛాలెంజింగ్ పాత్రలో కనిపించి ప్రశంసలు అందుకుంది సునైనా. కానీ కంటెంట్ కొత్తదనం లేకపోవడంతో ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదు. ఇప్పుడు ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ చేశారు.
ఈరోజు నుంచి రెజినా చిత్రాన్ని తెలుగు అడియన్స్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. క్రైమ్ థ్రిల్లర్ ఇష్టపడే ప్రేక్షకులకు ఈ వారం రెజినా మరింత ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాను ఎల్లో బేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించారు.
Telugu version of Tamil film #Regina (2023) by @domin_dsilva, ft. @TheSunainaa @AnanthNag24 @actorvivekpra @actor_saideena & @writerbava, now streaming on @PrimeVideoIN.@SathishNair20 @YugabhaarathiYb @telugufilmnagar @yellowbearprod @JungleeMusicSTH pic.twitter.com/LqN8WCOM5I
— CinemaRare (@CinemaRareIN) February 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.