AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha OTT : చెఫ్ మంత్ర సీజన్ 3.. ఆహాలోకి నిహారిక కొణిదెల ఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే

అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెఫ్ మంత్ర సీజన్ 3 రాబోతోంది. ఈ మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ మార్చి 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూడో సీజన్‌లో ప్రేక్షకులకు వినోదంతో పాటు.. సెలెబ్రిటీల ఫన్నీ చిట్ చాట్‌లు స్పెషల్ అట్రాక్షన్‌ కానున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ఎపిసోడ్స్ వస్తుంటాయి.

Aha OTT : చెఫ్ మంత్ర సీజన్ 3.. ఆహాలోకి నిహారిక కొణిదెల ఎంట్రీ.. ఇక రచ్చ రచ్చే
Niharika
Rajeev Rayala
|

Updated on: Feb 25, 2024 | 11:27 AM

Share

డైనమిక్ స్టార్ నిహారిక కొణిదెల ప్రస్తుతం ఓటీటీలో కొత్త అవతారాన్ని ఎత్తబోతోన్నారు. వినోదాత్మకంగా సాగే ఈ చాట్ షో ఆహా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చెఫ్ మంత్ర సీజన్ 3 రాబోతోంది. ఈ మూడో సీజన్ మొదటి ఎపిసోడ్ మార్చి 3న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ మూడో సీజన్‌లో ప్రేక్షకులకు వినోదంతో పాటు.. సెలెబ్రిటీల ఫన్నీ చిట్ చాట్‌లు స్పెషల్ అట్రాక్షన్‌ కానున్నాయి. ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో ఎపిసోడ్స్ వస్తుంటాయి.

ఇప్పటికే చెఫ్ మంత్ర రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ అయ్యాయి. ఈ సారి ఈ మూడో సీజన్‌ను నిహారిక కొణిదెల హోస్ట్ చేస్తుండటంతో మరింత ఆసక్తికరంగా మారింది. ఇకపై మరింత వినోదం, ఆటలు, ఆకర్షణీయమైన టాస్క్‌లతో నిండిన సరికొత్త షోని పరిచయం చేయబోతోన్నారు. నిహారిక తన మార్క్‌ను క్రియేట్ చేసేలా ఈ సీజన్ ఉండబోతోంది.

“చెఫ్ మంత్ర సీజన్ 3” చిత్ర పరిశ్రమలోని టాప్ అండ్ క్రేజీ స్టార్‌లను తీసుకురాబోతోన్నారు. ఇందులో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉండబోతోన్నాయి. నిహారిక కొణిదెల గెస్టులతో పెట్టే ముచ్చట్లు, పంచుకునే భావోద్వేగాలు, నవ్వులు, మరపురాని క్షణాలు ఇలా షో అంతా కూడా రోలర్‌ కోస్టర్ రైడ్‌లా ఉంటుంది. హృదయాన్ని కదిలించే కథల నుండి ఉల్లాసకరమైన ఆటల వరకు అన్నీ కూడా “చెఫ్ మంత్ర సీజన్ 3″లో ఉండబోతోన్నాయి.

మార్చి 3న చెఫ్ మంత్ర సీజన్ 3 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది. అటుపై ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ప్రత్యేకంగా ఆహాలో కొత్త ఎపిసోడ్‌లు ప్రసారం అవుతాయి. ఇక ప్రతీ శుక్రవారం ఆహా సబ్ స్క్రైబర్లకు అంతు లేని వినోదం అందబోతోంది. చెఫ్ మంత్ర సీజన్ 3ని హ్యాట్సన్ కర్డ్, ఫ్రీడమ్ ఆయిల్, వాల్యూ జోన్ హైపర్ మార్కెట్, ఈజీ కిచెన్ స్పాన్సర్ చేస్తోంది. వారి మద్దతుతో, ఈ సీజన్ మరింత ఎత్తుకు చేరుకుంటుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి