Anaganaga OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సుమంత్ సినిమా.. అనగనగా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ప్రేమకథ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని హీరో సుమంత్. రెండు దశాబ్దాలపైగా తనదైన నటనతో సినీప్రియులను అలరిస్తున్నారు సుమంత్. ప్రస్తుతం సహాయ నటుడిగా మూవీస్, వెబ్ సిరీస్ చేస్తూ అలరిస్తున్నాడు. ఇప్పుడు సుమంత్ నటించిన లేటేస్ట్ సినిమా అనగనగా.

Anaganaga OTT: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న సుమంత్ సినిమా.. అనగనగా స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Anaganaga Movie

Updated on: Apr 21, 2025 | 3:49 PM

తెలుగు సినీపరిశ్రమలో ఒకప్పుడు లవ్ స్టోరీ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అక్కినేని సుమంత్. కానీ ఈహీరోకు ఇప్పటివరకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న సుమంత్.. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టి్స్టుగా రాణిస్తున్నారు. ఇక ఇప్పుడు అక్కినేని హీరో సుమంత్ నటించిన లేటేస్ట్ మూవీ అనగనగా. సన్నీ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో కాజల్ చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రాన్ని మే 8 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. “పరీక్షల ఒత్తిడి ఎదుర్కొంటున్నారా.. ? చిల్ అవండి.. స్మైల్ ఇవ్వండి. స్మార్ట్ గా రివైజ్ చేయండి. బాగా నిద్రపోండి. మీపై మీరు నమ్మకం ఉంచండి. అనగనగా ఓ విన్ ఒరిజినల్ మూవీ.. మే 8 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానుంది’ అనే క్యాప్షన్ తో షేర్ చేశారు.

నిజానికి ఈ మూవీ టీజర్ గతంలోన విడుదలైంది. అందులో సుమంత్ పిల్లలకు అనగనగా అంటూ కథలు చెప్పే ఉపాధ్యాయుడిగా కనిపించారు. సన్నీ సంజయ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. చందు రవి మ్యూజిక్ అందించారు. ఇన్నాళ్లుగా ఒరిజినల్ కంటెంట్ తో సినిమాలు, వెబ్ సిరీస్ నిర్మిస్తున్న ఈటీవీ విన్.. ఇప్పుడు అనగనగా పేరుతో ఈ చిత్రాన్ని తీసుకువస్తుంది.

ఈ సినిమాలో సుమంత్ ఉపాధ్యాయుడిగా కనిపించనున్నారు. నేటి విద్యా వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడంతోపాటు చిన్నారులకు ఏ విధంగా పాఠాలు బోదిస్తే త్వరగా అర్థమవుతుందో చెప్పే ప్రయత్నం చేసినట్లు కొన్ని రోజుల క్రితం విడుదలైన టీజర్ చూస్తే అర్థమవుతుంది. మార్కుల కోసం పిల్లల ఏమాత్రం ఒత్తిడి పెంచకూడదని.. కాన్సెప్ట్ నేర్చుకుంటే చాలు మార్కులు వాటంతట అవే వస్తాయనేది ఆ టీచర్ నమ్మకం. ఆయన ప్రయత్నం ఫలించిందా ? అతడు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడు అనేది సినిమా.

ఇవి కూడా చదవండి

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..