న్యాచురల్ స్టార్ నాని (Nani), డైరెక్టర్ వివేక్ ఆత్రేయ కాంబోలో వచ్చిన చిత్రం అంటే సుందరానికీ (Ante Sundaraniki). ఫుల్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నానికి జోడిగా మలయాళ బ్యూటీ నజ్రీయా నజీమ్ కథానాయికగా నటించింది. నజ్రీయాకు తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం. జూన్ 10న విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇందులో బ్రహ్మణ అబ్బాయి సుందరం పాత్రలో నాని అలరించగా.. క్రిస్టియన్ అమ్మాయి లీలా థామస్ పాత్రలో నజ్రీయా మెప్పించింది. థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన సుందరం ఇప్పుడు డిజిటల్ సినీ ప్రియులను అలరించేందుకు సిద్ధం అయ్యాడు.
అంటే సుందరానికీ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూలై 10న అంటే సుందరానికీ మూవీ నెట్ ఫ్లిక్స్ లో తెలుగు, మలయాళం భాషలలో స్ట్రీమింగ్ కానున్నట్లు ఆదివారం మేకర్స్ సోషల్ మీడియా వేదికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా నిర్మించింది. ఇక నాని సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో దసరా మూవీ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్. ఇందులో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది. సింగరేణి నేపథ్యంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
You are cordially invited to witness the wedding story of Sundar and Leela ?❤️
Save the date! Ante Sundaraniki is coming to Netflix on the 10th of July in Telugu, Malayalam and Tamil.@NameisNani #NazriyaFahadh #VivekAthreya pic.twitter.com/yRw3XIewK5— Netflix India South (@Netflix_INSouth) July 3, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.