AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yatra 2 OTT: సైలెంట్‎గా ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ బయోపిక్ మూవీ.. ‘యాత్ర 2’ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

మొదటి భాగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కించగా.. ఇప్పుడు యాత్ర 2లో మాత్రం కేవలం జగన్ రాజకీయ జీవితాన్ని.. తండ్రి మాట కోసం నిలబడిన కొడుకు లైఫ్ స్టోరీని అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళీ నటుడు మమ్ముట్టి నటించగా.. జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు. ఫిబ్రవరి 8న ఈసినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Yatra 2 OTT: సైలెంట్‎గా ఓటీటీలోకి వచ్చేసిన పొలిటికల్ బయోపిక్ మూవీ.. 'యాత్ర 2' స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Yatra 2 Movie
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2024 | 8:06 AM

Share

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవితం..పాదయాత్ర ఆధారంగా తెరకెక్కించిన సినిమా యాత్ర 2. డైరెక్టర్ మహి వి రాఘవ్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. 2019లో సూపర్ హిట్ అయిన యాత్ర సినిమాకు సీక్వెల్ గా ఈ మూవీని తీసుకువచ్చారు. మొదటి భాగంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కించగా.. ఇప్పుడు యాత్ర 2లో మాత్రం కేవలం జగన్ రాజకీయ జీవితాన్ని.. తండ్రి మాట కోసం నిలబడిన కొడుకు లైఫ్ స్టోరీని అడియన్స్ ముందుకు తీసుకువచ్చాడు. ఇందులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళీ నటుడు మమ్ముట్టి నటించగా.. జగన్ పాత్రలో కోలీవుడ్ హీరో జీవా నటించారు. ఫిబ్రవరి 8న ఈసినిమా థియేటర్లలో సూపర్ హిట్ అయ్యింది. ఈ చిత్రానికి అన్ని వర్గాల అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు అడియన్స్.

అయితే ఎలాంటి హడావిడి లేకుండా సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసింది ఈ మూవీ. థియేటర్లలో విడుదలైన రెండు నెలల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి అటు అమెజాన్ గానీ.. ఇటు చిత్రయూనిట్ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఏపీలో ఎలక్షన్స్ హడావిడి కొనసాగుతున్న సమయంలో ఈ మూవీ ఓటీటీలోకి రావడం గమనార్హం.

ఇదిలా ఉంటే.. యాత్ర 2లో కోలీవుడ్ హీరో జీవా జగన్ పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. జగన్ బాడీ లాంగ్వేజ్, మేనరిజమ్స్ అచ్చుగుద్దినట్లు దింపేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని పలు గ్రామాల్లోని ప్రజలు జీవాను చూసి జగన్ అని భావించారు. అంతగా ఈ పాత్రలో జీవించేశారు జీవా. ఎప్పటిలాగే తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నారు. రంగం సినిమా తర్వాత చాలా కాలానికి యాత్ర 2 మూవీతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చాడు జీవా. ఇందులో మహేష్ మంజ్రేకర్, కేతకీ నారయణన్ కీలకపాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.