AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Premalu OTT: ఓటీటీలోకి వచ్చేసిన ‘ప్రేమలు’ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..

రొమాంటిక్-కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దాదాపు రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులోకి రిలీజ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

Premalu OTT: ఓటీటీలోకి వచ్చేసిన 'ప్రేమలు' మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడ అవుతుందంటే..
Premalu
Rajitha Chanti
|

Updated on: Apr 12, 2024 | 7:10 AM

Share

ఇటీవల మలయాళీ సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన సినిమా ప్రేమలు. యూత్‏ఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. యంగ్ హీరో నెస్లెన్ కె గపూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజు ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ భారీగా వసూళ్లు రాబట్టింది. రొమాంటిక్-కామెడీ చిత్రంగా రూపొందిన ఈ సినిమాను దాదాపు రూ.10 కోట్లతో భావనా స్టూడియోస్ బ్యానర్ పై ఫహద్ ఫాజిల్, దిలీప్ పోతన్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమా దాదాపు రూ. 130 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమాను డైరెక్టర్ రాజమౌళి తనయుడు కార్తీకేయ తెలుగులోకి రిలీజ్ చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈసినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో ఈ మూవీ గత అర్ధరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చేసింది. శుక్రవారం ఏప్రిల్ 12 నుంచి ఆహాలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది. అలాగే మలయాళం, తమిళం, హిందీ భాషల్లో ఈసినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం తెలుగు వెర్షన్ మాత్రమే ఆహాలో అందుబాటులో ఉంది. ప్రేమలు చిత్రానికి గిరీష్ ఎడి రచన, దర్శకత్వం వహించారు. శ్యామ్ మోహన్, అఖిలా భార్గవన్, సంగీత ప్రతాప్ , అల్తాఫ్ సలీం, మీనాక్షి రవీంద్రన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. తెలుగులో అత్యధిక వసూళ్లు రాబట్టిన మలయాళీ సినిమాగా ప్రేమలు నిలిచింది.

హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ యూవతను ఎక్కువగా ఆకట్టుకుంది. ఈ మూవీలో రీను పాత్రలో నటించిన హీరోయిన్ మమితా బైజుకు మరింత ఫాలోయింగ్ వచ్చేసింది. ఈ సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో మమితా క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇన్నాళ్లు థియేటర్లలో ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మిస్ అయిన వారు ఇప్పుడు నేరుగా ఓటీటీల్లోనే చూసి ఎంజాయ్ చేయొచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!