సల్మాన్‌కు అర్పితా గుర్తుండిపోయే బర్త్‌డే గిఫ్ట్

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 54వ పుట్టినరోజు శుక్రవారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ బర్త్‌డే రోజున అతడికి గుర్తుండిపోయే గిఫ్ట్‌ను ఇచ్చింది సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అర్పితా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన అర్పితా.. బుల్లి యువరాణికి స్వాగతం అని రాసింది. ఇక ఆ బిడ్డకు అయత్ శర్మ అనే పేరును కూడా పెట్టినట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ విషయాన్ని అర్పితా […]

సల్మాన్‌కు అర్పితా గుర్తుండిపోయే బర్త్‌డే గిఫ్ట్
Follow us

| Edited By:

Updated on: Dec 28, 2019 | 4:29 PM

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్ ఖాన్ 54వ పుట్టినరోజు శుక్రవారం అట్టహాసంగా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ బర్త్‌డే రోజున అతడికి గుర్తుండిపోయే గిఫ్ట్‌ను ఇచ్చింది సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ శర్మ. శుక్రవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది అర్పితా. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించిన అర్పితా.. బుల్లి యువరాణికి స్వాగతం అని రాసింది. ఇక ఆ బిడ్డకు అయత్ శర్మ అనే పేరును కూడా పెట్టినట్లు స్పష్టం చేసింది. మరోవైపు ఈ విషయాన్ని అర్పితా భర్త, నటుడు ఆయుష్ శర్మ కూడా సోషల్ మీడియాలో తెలుపుతూ.. సల్మాన్‌ ఖాన్‌కు ఇది గుర్తుండిపోయే గిఫ్ట్ అని తాము భావిస్తున్నాం అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కాగా 2014లో అర్పితా, ఆయుష్ శర్మల వివాహం జరిగింది. వీరికి 2016లో అహిల్ జన్మించాడు.

ఇదిలా ఉంటే సల్మాన్ ఖాన్ నటించిన ‘దబాంగ్ 3’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటి వంద కోట్ల క్లబ్‌లో చేరింది. బర్త్‌డే రోజున ఆయన ఈ అరుదైన రికార్డును సాధించి.. బాక్సాఫీస్ వద్ద తనకు తిరుగులేదని సల్మాన్ నిరూపించాడు. ఆయన నటించిన 15 సినిమాలు వంద కోట్ల క్లబ్‌లో చేరడంతో.. బాలీవుడ్‌లో ఈ రికార్డు సాధించిన మొదటి హీరోగా నిలిచాడు. కాగా ప్రస్తుతం రాధే చిత్రంలో నటిస్తోన్న సల్మాన్.. 20ఏళ్ల తరువాత సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

Latest Articles
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
T20 ప్రపంచకప్‌కు శ్రీలంక జట్టు.. కెప్టెన్ ఎవరో అసలు ఊహించలేరు
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
ఒకే గడ్డపై ఇద్దరు అగ్ర నేతలు.. ఏం మాట్లాడతారన్న సర్వత్రా ఆసక్తి!
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
బీఆర్ఎస్ నామమాత్రంగా పోటీః రేవంత్
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
మామిడి సీజన్‌లో చల్లగా ఇలా మ్యాంగో లస్సీ చేసుకోండి.. ఆహా అంటారు!
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
కోహ్లీ సెంచరీ మిస్.. పటిదార్ మెరుపులు.. RCB భారీ స్కోరు
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
పిండి రుబ్బకుండానే.. జస్ట్ పది నిమిషాల్లో గారెలు చేయొచ్చు..
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
తిరుగులేని టీమిండియా..బంగ్లాను క్లీన్‌స్వీప్ చేసిన భారత అమ్మాయిలు
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
నవనీత్‌ కౌర్‌ను వెంటనే పార్టీ నుంచి బహిష్కరించాలి.. సీఎం రేవంత్
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
గుజరాత్ నాయకులపై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..
ఐపీఎల్ యంగ్ ప్లేయర్ల సత్తా.. త్వరలోనే టీమిండియాలోకి ఎంట్రీ..