RRR Movie : హాలీవుడ్ నటికీ బర్త్ డే విషెస్ తెలిపిన ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. జెన్నిఫర్ పాత్రలో కనిపించనున్న ఒలీవియా
దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్లూరి సీతరామ రాజు..
RRR Movie : దర్శధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా ఆర్.ఆర్.ఆర్ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అల్లూరి సీతరామ రాజు, తెలంగాణ ప్రాంతానికి చెందిన కొమురం భీంలు ఇద్దరు ఒకవేళ కలిస్తే, వారి మధ్య స్నేహం ఉంటే ఎలా ఉంటుందన్న కల్పిత కథ ఆధారంగా జక్కన్న ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఇప్పటికే ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలను పరిచయం చేస్తూ విడుదల చేసిన టీజర్‌లు నెట్టింట్లో సంచనలం సృష్టించాయి. ఇక చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ కథానాయికగా నటిస్తుండగా.. యంగ్ యమ ఎన్టీఆర్ సరసన ఒలీవియా నటిస్తోంది .ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హాలీవుడ్ నటి ఒలీవియా పోస్టర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. నేడు ఈ ఆముద్దుగుమ్మ పుట్టిన రోజు కానుకగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు చిత్రయూనిట్. ఈ మూవీలో జెన్నిఫర్ పాత్రలో ఒలీవియా కనిపించనుంది. దసరా కానుకగా 13 అక్టోబర్ 2021న ఈ మూవీ రిలీజవుతోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :
KGF 2 : ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ క్రేజీ అప్‌డేట్ ఆన్ ద వే .. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు