AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ క్రేజీ అప్‌‌‌‌‌డేట్.. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు అనౌన్స్ చేసిన మేకర్స్

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు డార్లింగ్...

ప్రభాస్-నాగ్ అశ్విన్ మూవీ క్రేజీ అప్‌‌‌‌‌డేట్.. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్ పేర్లు అనౌన్స్ చేసిన మేకర్స్
Rajeev Rayala
|

Updated on: Jan 29, 2021 | 1:20 PM

Share

Prabhas and Nag Ashwin film : రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస భారీ బడ్జెట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ ను పూర్తి చేసాడు డార్లింగ్. ఆతర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ సినిమాను పట్టాలెక్కించాడు. ఈ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలు జరుపుకుంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మరోవైపు ఆదిపురుష్ సినిమాను కూడా షురూ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. ఈ సినిమాకు బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే ఈ సినిమాలతో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. ఈ సినిమాసైన్స్ ఫిక్షన్ గా తెరకెక్కుతోందని మొదటినుంచి ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకొనే హీరోయిన్ గా వైజయంతి సంస్థ ప్రకటించింది. ఇక బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమానుంచి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్ . సినిమాటోగ్రాఫర్ సంగీత దర్శకుల వివరాల్ని వైజయంతి సంస్థ వెల్లడిస్తూ పోస్టర్ ని రిలీజ్ చేసింది. `మహానటి`కి పని చేసిన స్పానిష్ టెక్నీషియన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు. అలాగే  మిక్కీజే మేయర్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు-తమిళం-హిందీ భారీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

మరిన్ని ఇక్కడ చదవండి :

Mohan Babu: సీరియస్ లుక్‌లో మోహన్ బాబు.. ‘సన్నాఫ్ ఇండియా’ ఫస్ట్‌లుక్ రిలీజ్

విటమిన్-D లోపం ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయి? లోపాన్ని ఎలా పోగొట్టాలి
విటమిన్-D లోపం ఉంటే ఎలాంటి సమస్యలొస్తాయి? లోపాన్ని ఎలా పోగొట్టాలి
వజ్రాన్ని పట్టేసిన కావ్యపాప.. ఐపీఎల్ 2026లో ఇక గత్తరలేపుడే
వజ్రాన్ని పట్టేసిన కావ్యపాప.. ఐపీఎల్ 2026లో ఇక గత్తరలేపుడే
డిసెంబర్‌ 22న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ వారంలో బ్యాంకు సెలవులు ఇవే
డిసెంబర్‌ 22న బ్యాంకులు మూసి ఉంటాయా? ఈ వారంలో బ్యాంకు సెలవులు ఇవే
టీమిండియాకు విలన్‌లుగా మారిన ఇద్దరు.. ఇట్టైతే పరువు పోయినట్టే?
టీమిండియాకు విలన్‌లుగా మారిన ఇద్దరు.. ఇట్టైతే పరువు పోయినట్టే?
రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? ఇంట్రెస్టింగ్ స్టోరీ!
రైల్వే ట్రాక్‌లో లూప్‌లైన్‌ అంటే ఏమిటి..? ఇంట్రెస్టింగ్ స్టోరీ!
రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్‌గా ‘ఎట్ హోమ్‌’..!
రాష్ట్రపతి నిలయంలో గ్రాండ్‌గా ‘ఎట్ హోమ్‌’..!
కామనర్ కప్పు గెలిచాడు.. బిగ్ బాస్ విజేతగా కళ్యాణ్..
కామనర్ కప్పు గెలిచాడు.. బిగ్ బాస్ విజేతగా కళ్యాణ్..
గుండె ఆగిపోయే ఉత్కంఠ.. మెంటలెక్కించే ట్విస్టులు..
గుండె ఆగిపోయే ఉత్కంఠ.. మెంటలెక్కించే ట్విస్టులు..
ఆధార్ స్కామ్.. ఒక చిన్న పొరపాటు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ.. అదేంటంటే..
ఆధార్ స్కామ్.. ఒక చిన్న పొరపాటు మీ బ్యాంక్ ఖాతా ఖాళీ.. అదేంటంటే..
బార్‌లో విచక్షణారహితంగా కాల్పులు.. 9 మంది మృతి!
బార్‌లో విచక్షణారహితంగా కాల్పులు.. 9 మంది మృతి!