KGF 2 : ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ క్రేజీ అప్‌డేట్ ఆన్ ద వే .. ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులు
కన్నడ స్టార్ హీరో యష్ నటించిన కేజీఎఫ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్నిభాషల్లోను సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది..
KGF 2 : కన్నడ స్టార్ హీరో యష్ నటించిన ‘కేజీఎఫ్’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా అన్నిభాషల్లోనూ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. కన్నడలో రూ.200 కోట్ల మార్క్‌ను దాటిన తొలి సినిమాగా రికార్డు కూడా సొంతం చేసుకుంది. ఇప్పుడీ చిత్రానికి కొనసాగింపుగా ‘కేజీఎఫ్ ఛాప్టర్ 2’ తెరకెక్కిస్తున్నారు దర్శకుడు ప్రశాంత్ నీల్. పార్ట్ 1 కు మించిన యాక్షన్ సీన్స్ తో పార్ట్ 2ను రూపొందిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనాటాండన్ నటిస్తున్నారు. విలన్ అధీర పాత్రలో సంజయ్ కనిపించనున్నారు. మరోవైపు ప్రధాన మంత్రి పాత్రలో రవీనా టాండన్ పవర్‌ఫుల్ రోల్ ప్లే చేస్తోంది. యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరి 8న చిత్ర టీజర్‌ను విడుదల చేసారు మేకర్స్. ఈ టీజర్ ఇప్పుడు రికార్డ్ ను తిరగరాస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి మరో అప్‌డేట్ ఇవ్వనుంది చిత్రయూనిట్. శుక్రవారం సాయంత్రం 6.32 కు కేజీఎఫ్ 2 నుంచి క్రేజీ అప్డేట్ ఇవ్వనుంది. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా కోసం అన్ని బాషల ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో చూడాలి.
మరిన్ని ఇక్కడ చదవండి :
Rajinikanth : మరోసారి తెరపైకి రజినీకాంత్ ‘రానా’ సినిమా.. ఎలాగైనా సినిమా తీస్తానంటున్న దర్శకుడు..