రికార్డుల వేటలో ఎన్టీఆర్.. రామ‌రాజు ఫ‌ర్ బీం టీజర్‌కు 30 మిలియన్ వ్యూస్ అండ్ కౌంటింగ్.!

రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ హైబడ్జెట్‌ ఎంటర్టైనర్..

రికార్డుల వేటలో ఎన్టీఆర్.. రామ‌రాజు ఫ‌ర్ బీం టీజర్‌కు 30 మిలియన్ వ్యూస్ అండ్ కౌంటింగ్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 14, 2020 | 1:25 PM

NTR Komaram Bheem Teaser: రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధానపాత్రల్లో దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. పీరియాడికల్ మూవీగా రూపొందుతున్న ఈ హైబడ్జెట్‌ ఎంటర్టైనర్ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్లు ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణను పొందుతున్నాయి. అంతేకాకుండా చిత్రంపై అంచనాలను అమాంతం పెంచేశాయి.

ఇదిలా ఉంటే కొమురం భీం టీజర్‌తో జూనియర్ ఎన్టీఆర్ రికార్డులు సృష్టిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటిసారి మిలియన్ లైక్స్ సాధించిన టీజర్‌గానే కాకుండా లక్ష కామెంట్స్ పొందిన ఫస్ట్ టీజర్‌గా రామ‌రాజు ఫ‌ర్ బీం నిలిచింది. ఇక వేగంగా 30 మిలియన్ల వ్యూస్ పొందిన టాలీవుడ్ టీజర్‌గా కూడా రికార్డు సృష్టించింది. కాగా, ఎన్టీఆర్ కొమురం భీం టీజర్ రికార్డులు క్రియేట్ చేస్తుండటంతో ఆయన ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ట్రిపుల్ ఆర్ సినిమా‌ను డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

Also Read:

డిసెంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌.? వైరల్ అవుతున్న ట్వీట్.. వివరణ ఇచ్చిన కేంద్రం..

తెలంగాణలో బాణసంచాపై బ్యాన్ విధించిన ప్రభుత్వం.. ఉత్తర్వులు జారీ.. అమ్మకాలు చేస్తే చర్యలు..

సీఎస్‌కే ఫ్యాన్స్‌కు షాక్.. ఐపీఎల్ 2021లో కొత్త జట్టుకు కెప్టెన్‌గా సురేష్ రైనా.!

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సచివాలయాల్లోని ఇంజనీరింగ్ అసిస్టెంట్లలకు మరో బాధ్యత..

సాయం కోరిన సోనూసూద్.. స్పందించిన నెటిజన్లు.. థ్యాంక్యూ చెప్పిన రియల్ హీరో..