AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షకీరా, జెన్నీఫర్‌‌ లోపెజ్ కాదు.. ఆమె నా ఇన్‌స్పిరేషన్ అని తేల్చేసిన బాలీవుడ్ సెన్సేషన్

సింగిల్ మదర్ పెంపకంలో తను ఎదుర్కొన్న సవాళ్లు, తన తండ్రి తన జీవితం నుండి దూరమవ్వడం వల్ల కలిగిన 'డాడీ ఇష్యూస్' గురించి నోరా మనసు విప్పి మాట్లాడారు. సెలబ్రిటీలను చూసి ఇన్స్పైర్ అవ్వడం కంటే, తన తల్లి పడిన కష్టం తనను ఎలా మార్చిందో ఆమె వివరించారు. ఎప్పుడూ తన గ్లామర్, డ్యాన్స్ గురించి మాత్రమే మాట్లాడే నోరా, మొదటిసారి తన బలహీనతలు, మానసిక సమస్యల గురించి మాట్లాడటం విశేషం.

షకీరా, జెన్నీఫర్‌‌ లోపెజ్ కాదు.. ఆమె నా ఇన్‌స్పిరేషన్ అని తేల్చేసిన బాలీవుడ్ సెన్సేషన్
Nora Fatehi Latest
Nikhil
|

Updated on: Apr 13, 2026 | 6:25 AM

Share

బాలీవుడ్ సెన్సేషనల్ డ్యాన్సర్ నోరా ఫతేహి ఇటీవల ‘కేడీ: ది డెవిల్’ చిత్రంలోని తన పాట వివాదంతో వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా ఆమె ప్రముఖ యూట్యూబర్ లిల్లీ సింగ్ పాడ్‌కాస్ట్‌లో పాల్గొని తన వ్యక్తిగత జీవితం మరియు పెంపకం గురించి ఎవరూ ఊహించని నిజాలను పంచుకున్నారు. వెండితెరపై ఎంతో ధైర్యంగా, గ్లామరస్‌గా కనిపించే నోరా వెనుక ఒక సాధారణ అమ్మాయి పడిన సంఘర్షణ, ఆమె మానసిక స్థితి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

 అమ్మే నా స్ఫూర్తి

నోరా తన తల్లి గురించి మాట్లాడుతూ.. “నేను షకీరా, జెన్నిఫర్ లోపెజ్ వంటి వారిని చూసి స్ఫూర్తి పొందేదాన్ని కానీ, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మా అమ్మే నా అతిపెద్ద ఇన్స్పిరేషన్ అని అర్థమైంది” అని తెలిపారు. ఒక సింగిల్ మదర్‌గా తనను, తన సోదరుడిని పెంచడానికి ఆమె ఎన్నో పనులు చేస్తూ, కఠినమైన జీవితాన్ని గడిపారని నోరా గుర్తు చేసుకున్నారు. సమాజంలో ఐకానిక్ ఫిగర్స్ కంటే మన చుట్టూ ఉండి మన కోసం కష్టపడే వారే నిజమైన హీరోలని ఆమె పేర్కొన్నారు.

డాడీ ఇష్యూస్

తన తండ్రి గురించి మాట్లాడుతూ నోరా కొన్ని షాకింగ్ విషయాలు చెప్పారు. “నాకు డాడీ ఇష్యూస్ ఉన్నాయి. మా తల్లిదండ్రులు విడిపోయిన తర్వాత నా తండ్రి చాలా కాలం మమ్మల్ని పట్టించుకోలేదు” అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా వలస వెళ్ళిన సంప్రదాయ కుటుంబాలలో పాతకాలపు ఆలోచనలకు, నేటి తరం లక్ష్యాలకు మధ్య ఉండే వ్యత్యాసం మనశ్శాంతిని దెబ్బతీస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఇంట్లో ఒక రకమైన వాతావరణం, బయట ప్రపంచంలో మరో రకమైన వాతావరణం ఉండటం వల్ల వ్యక్తిత్వాన్ని వెతుక్కోవడంలో ఎంతో సంఘర్షణ ఎదురవుతుందని ఆమె వివరించారు.

అబాండన్మెంట్ ఇష్యూస్

తండ్రి తనను వదిలి వెళ్ళడం వల్ల నోరాలో ‘అబాండన్మెంట్ ఇష్యూస్’ (వదిలివేయబడతామనే భయం) మొదలయ్యాయి. దీనివల్ల రిలేషన్ షిప్స్ విషయంలో ఆమె ఎన్నో ఇబ్బందులు పడ్డారట. “ఎవరైనా నన్ను వదిలి వెళ్లినా లేదా బంధం విడిపోయినా అది నాకు చాలా భారంగా అనిపిస్తుంది. అది ఎదుటివారి సమస్య కాదు, నా పెంపకం వల్ల కలిగిన మానసిక స్థితి” అని ఆమె ఒప్పుకున్నారు. తనకు సరిపడని వ్యక్తులతో కూడా అందుకే బంధాన్ని తెంచుకోలేకపోయానని ఆమె వాపోయారు. ఇప్పటికీ ఈ సమస్యల నుండి బయటపడటానికి తాను ప్రయత్నిస్తున్నానని నోరా ముగించారు.

Follow Us