AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramayanam: రాముడిగా హృతిక్‌రోషన్‌… సీతగా దీపికా పదుకొణె.. త్రీడీలో రామాయాణం…

3D Ramayanm In Bollywood: ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ కొనసాగితే ఇతరులూ అదే ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. ఒక జానర్‌లో సినిమాలు వస్తే.. అదే కోవలో మరికొన్ని సినిమాలు వస్తుంటాయి. బాహుబలి తర్వాత అలాంటి...

Ramayanam: రాముడిగా హృతిక్‌రోషన్‌... సీతగా దీపికా పదుకొణె.. త్రీడీలో రామాయాణం...
Narender Vaitla
|

Updated on: Feb 02, 2021 | 5:27 AM

Share

3D Ramayanm In Bollywood: ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ కొనసాగితే ఇతరులూ అదే ట్రెండ్‌ను ఫాలో అవుతుంటారు. ఒక జానర్‌లో సినిమాలు వస్తే.. అదే కోవలో మరికొన్ని సినిమాలు వస్తుంటాయి. బాహుబలి తర్వాత అలాంటి నేపథ్యంలో పలు సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ స్థాయి విజయాన్ని మాత్రం అందుకోలేకపోయాయి. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో ఇప్పుడు మరోసారి అలాంటి ట్రెండ్ కొనసాగనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ దర్శకుడు ఓంరౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. రామాయణం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటి నుంచే భారీ అంచనాలున్నాయి. మోషన్‌ సెన్సార్‌ టెక్నాలజీతో అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మొత్తం ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ చూపు ఉంది. ఇదిలా ఉంటే ఇంకా ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తికాక ముందే ఇదే కోవలో మరో చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లో రామాయణం కథాంశంగా మరో సినిమా తెరకెక్కనుందని సమాచారం. త్రీడీ టెక్నాలజీతో రూపొందించనున్న ఈ సినిమాలో రాముడిగా హృతిక్‌ రోషన్‌ నటిస్తుండగా, సీతగా దీపికాపదుకొణె నటించనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు ‘దంగల్‌’ ఫేమ్‌ నితీష్‌ తివారి దర్శకత్వం వహించనున్నాడని సమాచారం.

Also Read: కడలిలో కళ్యాణం, స్కూబా డైవింగ్‌ సెషన్స్‌కి హాజరై మరీ తాళి కట్టించుకున్న వధువు శ్వేత. తీరం నుంచి 4.5 కిలోమీటర్లలోపల పెళ్లి తంతు