ఆ సినిమాను అల్లు అర్జున్ తో కాదని మరో స్టార్ హీరోతో చేస్తున్నారా.. ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త

ఆ సినిమాను అల్లు అర్జున్ తో కాదని మరో స్టార్ హీరోతో చేస్తున్నారా.. ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న వార్త

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నడని సమాచారం.

Rajeev Rayala

| Edited By: Rajitha Chanti

Apr 21, 2021 | 7:04 AM

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా నటిస్తున్నడని సమాచారం. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్‌, ముత్తంశెట్టి క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా..దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.  తర్వాత బన్నీ నటించనున్న సినిమా ఐకాన్.  వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే.  వకీల్ సాబ్ సినిమా సూపర్ హిట్ అయ్యింది కాబట్టి శ్రీరామ్ కు వరుస అవకాశాలు క్యూ కడతాయి. అయితే వకీల్ సాబ్ సినిమాకంటే ముందే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమాను కన్ఫామ్ చేసాడు వేణు శ్రీరామ్. ఈ మూవీకి ఐకాన్ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను కూడా పెట్టేసాడు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని ఈ మధ్య వార్తలు ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది. వకీల్ సాబ్ సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత వేణు శ్రీరామ్ పూర్తిగా ఆ సినిమా పనిలో పడ్డాడు. అటు బన్నీ కూడా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప సినిమా షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు. దాంతో ఐకాన్ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దాంతో నిర్మాత దిల్ రాజు ఎంటర్ అయ్యి సినిమా ఆగిపోలేదని క్లారిటీ ఇచ్చాడు. అయినా ఈ సినిమాపై గుసగుసలు మాత్రం ఆగడం లేదు తాజాగా ఐకాన్ సినిమాను బన్నీ తో కాకుండా మరో హీరోతో చేయనున్నారని ప్రచారం జరుగుతుంది. అల్లు అర్జున్ ‘ఐకాన్’ చేయడం లేదని.. ఈ స్క్రిప్ట్ పై పూర్తి నమ్మకం పెట్టుకున్న దిల్ రాజు ఇప్పుడు వేరే హీరో కోసం ప్రయత్నాలు చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మరి ఈవార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Adipurush: ‘ఆదిపురుష్’ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్‏డేట్.. షూటింగ్ గురించి చెప్పుకోచ్చిన డైరెక్టర్..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu