Nayanatara: సరోగసి కేసు నుంచి బయటపడేందుకు నయన్‌ దంపతుల ప్రయత్నాలు.. అలా చేస్తే ఇబ్బందులు ఉండవంటూ..

|

Oct 14, 2022 | 9:39 PM

తమిళనాడు ప్రభుత్వం కూడా సరోగసి వ్యవహారంపై పూర్తి వివరాలు అందించాలని నయన్‌ దంపతులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు నయన్‌ కానీ, విఘ్నేశ్‌ కానీ వీటిపై స్పందించలేదు.

Nayanatara: సరోగసి కేసు నుంచి బయటపడేందుకు నయన్‌ దంపతుల ప్రయత్నాలు.. అలా చేస్తే ఇబ్బందులు ఉండవంటూ..
Nayanatara
Follow us on

కోలీవుడ్‌ సెలబ్రిటీ కపుల్‌ నయనతార- విఘ్నేశ్‌ శివన్‌ సరోగసి ద్వారా తల్లిదండ్రులు కావడంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సోషల్‌ మీడియాలోనూ ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. కస్తూరి లాంటి సినిమా సెలబ్రిటీలు, ప్రముఖులు సరోగసి విషయంలో నయనతార దంపతులపై విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు తమిళనాడు ప్రభుత్వం కూడా సరోగసి వ్యవహారంపై పూర్తి వివరాలు అందించాలని నయన్‌ దంపతులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇప్పటివరకు నయన్‌ కానీ, విఘ్నేశ్‌ కానీ వీటిపై స్పందించలేదు. కాగా నయనతార పిల్లలకు జన్మనిచ్చిన మహిళ ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారని సమాచారం. ఆమెకు నయనతార సోదరుడితో సన్నిహిత సంబంధాలున్నాయని అందుకే సరోగసికి అంగీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు సరోగసీపై దుబాయ్‌లో ఎలాంటి నిబంధనలు, ఆంక్షలు లేవు. ఇప్పుడీ విషయాలే తమకు కలిసొస్తాయని, సరోగసీ కేసులో ఎలాంటి ఇబ్బందులు కలగవని నయనతార దంపతులు భావిస్తున్నట్లు సమాచారం.

ఇండియాలో అమలవుతోన్న సరోగసీ చట్టం ప్రకారం పెళ్లయిన తర్వాత పిల్లలు పుట్టకుంటే మాత్రమే సరోగసీని ఎంచుకోవాలి. అదేవిధంగా పిల్లలకు జన్మనిచ్చే మహిళ దగ్గరి బంధువు కానీ, సన్నిహితులు కానీ ఉండాలి. ఈనేపథ్యంలో దుబాయ్‌లో నివసిస్తోన్న ఓ మహిళే నయనతార పిల్లలకు జన్మనిచ్చిందని తెలుస్తోంది. ఆమె మలయాళీ అని, వీరికి నయన్‌తోపాటు ఆమె సోదరుడికి సన్నిహిత సంబంధాలున్నాయని సమాచారం. మరోవైపు నయన్‌ దంపతులు సరోగసీ వ్యవహారంపై విమర్శలు ఎక్కువవుతున్నాయి. వారు నిబంధనలు అతిక్రమించి పిల్లలు కన్నారంటూ వారిని తప్పుపడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..