నాని- విక్రమ్ మూవీ ప్రారంభం

నాని- విక్రమ్ మూవీ ప్రారంభం

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించనున్న చిత్రం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరగగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, నిర్మాత శరత్ మరార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక నాని 24వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 18, 2019 | 12:12 PM

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించనున్న చిత్రం ప్రారంభమైంది. హైదరాబాద్‌లో ఈ మూవీ పూజా కార్యక్రమాలు ఘనంగా జరగగా.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, నిర్మాత శరత్ మరార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక నాని 24వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. కాగా ప్రస్తుతం నాని, గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu