Dasara Movie: దసరా పండుగ రోజున దసరా సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్.. సిల్క్‌స్మిత సాక్షిగా ప్రకటించిన నాని..
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్‌తోనే దర్శకుడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు
నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేశ్ నటిస్తోంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. సినిమా ఫస్ట్ లుక్‌తోనే దర్శకుడు అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ఇక శ్యామ్ సింగరాయ్ వంటి విజయం తర్వాత నాటి నటిస్తోన్న చిత్రం కావడం, నేను లోకల్ వంటి చిత్రం తర్వాత నాని కీర్తి సురేష్ నటిస్తున్న చిత్రం కావడంతో ‘దసరా’ మూవీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తోంది. మునుపెన్నడూ కనిపించనంతా మాస్ లుక్‌లో కనిపిస్తున్న నాని క్యారెక్టర్ సినిమాలో ఎలా ఉంటుందన్న క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో నెలకొంది.
ఇదిలా ఉంటే నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాది మొదలైనప్పటికీ కొన్ని కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే తాజాగా సినిమా చిత్రీకరణలో వేగాన్ని పెంచిన చిత్ర యూనిట్ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసే పనిలో పడింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చిత్ర యూనిట్ ప్రేక్షకులకు కోసం సర్‌ప్రైజ్‌ను ప్లాన్ చేసింది. దసరా కానుకగా దసరా సినిమా నుంచి అప్‌డేట్‌ను ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నానినే తెలిపాడు. ట్విట్టర్ వేదికగా ప్రత్యేకంగా రూపొందించిన వీడియోతో నాని ఈ విషయాన్ని పోస్ట్ చేశాడు.
It’s time ?#DhoomDhaamDhosthaan This#Dasara pic.twitter.com/ZbUOc57vNp
— Nani (@NameisNani) September 29, 2022
ఈ వీడియోలో నాని సిల్క్ స్మిత పోస్టర్ ముందు కూర్చొని ‘ధూమ్ ధామ్ దోస్తాన్’ అనే సాంగ్‌ను దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి స్థాయిలో మాస్ నేపథ్యంలో ఈ సాంగ్ ఇప్పటి వరకు వచ్చిన మాస్ సాంగ్స్‌లో బెస్ట్‌గా నిలుస్తుందని నాని తెలిపారు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ పాట దసరాకు రానుందని పేర్కొన్నాడు. చివర్లో సిల్క్ స్మిత పోస్టర్‌ను చూడడంతో ఈ సాంగ్ ఆ అలనాటి తారను ఉద్దేశించి ఉంటుందా.? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..