ఆకట్టుకుంటోన్న ‘సవారీ’ టీజర్!

యంగ్ హీరో నందు ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు సాహిత్ మోత్కురి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సవారీ’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కామెడీ సన్నివేశాలతో నిండి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో నందు సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు. నూతన నటి ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ […]

ఆకట్టుకుంటోన్న 'సవారీ' టీజర్!
Follow us

|

Updated on: Jul 06, 2019 | 1:00 AM

యంగ్ హీరో నందు ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు సాహిత్ మోత్కురి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సవారీ’. ఇటీవలే ఈ చిత్ర టీజర్ విడుదలైంది. కామెడీ సన్నివేశాలతో నిండి ఉన్న ఈ టీజర్ ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో నందు సరికొత్త పాత్రలో కనిపించనున్నాడు.

నూతన నటి ప్రియాంక శర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి శేఖర్ చంద్ర మ్యూజిక్ అందిస్తున్నాడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను నిషాంక్ అండ్ సంతోష్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిషాంక్ రెడ్డి, సంతోష్ మోత్కురి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.