Kalyanram is Agent Vinod: 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్పై థ్రిల్లర్ మూవీ ఏజెంట్ వినోద్ గా రానున్న నందమూరి హీరో
నందమూరి కల్యాణ్ రామ్ సరికొత్త సినిమాను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అందరి హీరోల్లా.. భారీ బడ్జెట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఓ పీరియాడికల్ డ్రామాకు ముహూర్తం పెట్టబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది...
Kalyanram is Agent Vinod: నందమూరి కల్యాణ్ రామ్ సరికొత్త సినిమాను తెరకెక్కించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు. అందరి హీరోల్లా.. భారీ బడ్జెట్ సినిమాల వైపు అడుగులు వేస్తున్నాడు. భారీ బడ్జెట్‌తో ఓ పీరియాడికల్ డ్రామాకు ముహూర్తం పెట్టబోతున్నాడనే టాక్ వినిపిస్తోంది.
హీరోగా అడుగు పెట్టిన అతనొక్కడే సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.. తర్వాత అదే మూస ధోరణి సినిమాలు చేస్తూ ఉండే కల్యాన్ రామ్.. ఆ తరువాత ఎన్టీఆర్ బ్యానర్ స్థాపించి ఢిఫరెంట్ నేపధ్య కథలతో సినిమాలు తీయడం స్టార్ట్ చేశాడు. ఇక ఇప్పుడు కూడా ‘ఏజెంట్ వినోద్’ గా పీరియాడికల్ డ్రామాలో నటించబోతున్నాడు. ‘బాబు బాగా బిజీ’ ఫేమ్ నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు.
ఇప్పటి వరకు పీరియాడికల్ మూవీలో నటించని నందమూరి కల్యాణ్‌రామ్ డైరెక్టర్ నవీన్ కథ చెప్పగానే ఓకే చెప్పేశాడట. 1940 బ్యాక్‌డ్రాప్‌లో ఈ స్పై థ్రిల్లర్ రూపొందనుందట. అయితే ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయట. పీరియాడికల్ కథాంశం కావడం.. 1940 ఎన్‌విరాన్మెంట్ చూపించాల్సి ఉండడంతో ఈ సినిమా మేకింగ్‌లో వీఎఫ్‌ఎక్స్ కీలకంగా మారనున్నాయట. అయితే కల్యాణ్ రామ్ ప్రజెంట్ మల్లిడి వేణు సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు.
Also Read: