Game Of Thrones : ఆ సింగర్ నన్ను కట్టేసి, కొరడాతో కొడుతూ లైంగికంగా వేధించాడు.. చీకటి రోజులు గుర్తు తెచ్చుకున్న నటి
హాలీవుడ్, బాలీవుడ్ టాలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు.. తాజాగా ఎస్మే బియాంకో తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అంటూ సంచలన విషయాలను వెల్లడించింది. సింగర్, గేయ రచయిత మార్లిన్ మాన్సన్ తో కలిసి..
Game Of Thrones Actor Esme Bianco: హాలీవుడ్, బాలీవుడ్ టాలీవుడ్ ఇలా ఏ వుడ్ అయినా మహిళలకు లైంగిక వేధింపులు తప్పడం లేదు.. తాజాగా ఎస్మే బియాంకో తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అంటూ సంచలన విషయాలను వెల్లడించింది. సింగర్, గేయ రచయిత మార్లిన్ మాన్సన్ తో కలిసి ఉన్న సమయంలో తీవ్రంగా చిత్ర హింసలకు గురి చేశాడని అతనితో ఉన్న రోజులు తనకి చీకటిరోజులని తెలిపింది. అంతేకాదు అతను మరెంతమందో మహిళలు శారీరకంగా మానసికంగా వేధింపులకు గురి చేశాడంటూ ఓ ఇంటర్య్వూలో మాట్లాడుతూ సంచలన సంచలన ఆరోపనలు చేసింది.
‘ఫాంటస్మాగోరి’ థ్రిల్లర్ మూవీ సమయంలో తన మాజీ భర్త, డ్యాన్సర్ డిటా వాస్ టీసే ద్వారా మార్లిన్ తో పరిచయమయ్యిందని తెలిపింది. ఇక 2007లో తను వాస్ టీస్‌తో విడిపోయిన అనంతరం మార్లిన్ తో సాన్నిత్యం పెరిగిందని.. అనంతరం 2009 ‘ఐ వాంట్ టూ కిల్ యు లైక్ దే ఇస్ ది మూవీస్’ అనే ఆల్బంలోని ఓ పాటలో తనను నటించమని మాన్సన్ కోరాడని చెప్పింది. అయితే ఈ సాంగ్‌లో ఓ సైకో ప్రియుడి చేత కిడ్నాప్ చేయబడిన బాధిత ప్రియురాలిగా నటించాలని చెప్పాడు. అది నిజమైప నటననే నమ్మాను. అయితే మాన్సన్ షూటింగ్ పేరుతో ఓ రూమ్ లో బంధించి.. చిత్ర హింసలకు గురి చేశాడని తెలిపింది. అంతేకాదు..మూడు రోజుల షూట్‌లో కేవలం తాను లోదుస్తులపైనే ఉన్నాను. ఆ సమయంలో మాన్సన్ ఆహారం ఇవ్వలేదని కోకైన్ మాత్రమే ఇచ్చేవాడని ఎస్మే బియాంకో తెలిపింది.
ఇక అతనితో డేటింగ్ సమయంలో తను ఒక ఖైదీలా ఉన్నానని ఆవేదన వ్యక్తం చేసింది. ఇక శృంగారం సమయంలో మాన్సన్ తనను కోరికేసి, శరీరాన్ని గాయపరిచేవాడు ఇప్పటికి ఆ గాయాలు ఉన్నాయఅంటూ ఆ చీకటి రోజులను గురించేసింది ఎస్మే బియాంకో. అయితే మార్లిన్ మాన్సస్ మాత్రం బియాంకో ఆరోపణలను కొట్టిపారేశాడు.
Also Read: