
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు జయకృష్ణ సతీమణి పద్మజ ఇవాళ ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ఉదయం తుది శ్వాస విడిచారు. నందమూరి పద్మజ మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావుకు స్వయాన సోదరి.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
కొన్నిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమెకు ఈరోజు తెల్లవారుజామున శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిపడుతుండడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు స్వయానా చెల్లెలు.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
నందమూరి జయకృష్ణ, పద్మజల తనయుడు చైతన్య కృష్ణ హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. గతంలో ధమ్, బ్రీత్ సినిమాల్లో హీరోగా నటించాడు. తన తండ్రి జయకృష్ణ నిర్మించిన బ్రీత్ సినిమా థియేటర్లలో డిజాస్టర్ అయ్యింది. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమా చేయలేదు.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..