Naga Chaitanya: ‘ఆమె మా హృదయాలను ముక్కలు చేసింది’.. ఫస్ట్‌ లవ్‌ గురించి చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..

Naga Chaitanya: నాగచైతన్య హీరోగా తెరకెక్కి తాజా చిత్రం థ్యాంక్యూ (Thank you). విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జులై 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది...

Naga Chaitanya: 'ఆమె మా హృదయాలను ముక్కలు చేసింది'.. ఫస్ట్‌ లవ్‌ గురించి చైతన్య ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌..
Follow us

|

Updated on: Jul 19, 2022 | 6:30 AM

Naga Chaitanya: నాగచైతన్య హీరోగా తెరకెక్కి తాజా చిత్రం థ్యాంక్యూ (Thank you). విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జులై 22న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది. ఇందులో చై సరసన రాశీఖన్నా, మాళవిక, అవికా గోర్ నటిస్తున్నారు. ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా చిత్ర ట్రైలర్‌, పాటలు మంచి జబ్‌ను తెచ్చాయి. ఓ యువకుడి జీవితంలో ఎదురైన సంఘటనల సమాహారంగా ఈ సినిమా కథ ఉండనున్నట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. మంచి ఫీల్‌ గుడ్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రమోషన్స్‌ను చిత్ర యూనిట్‌ శరవేగంగా కొనసాగిస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా రాశీ ఖన్నా, నాగ చైతన్య ఓ ఇంటర్వ్యూలో సందడి చేశారు. ఈ సందర్భంగా చైతన్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. జీవితంలో తన తొలి ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. ఈ విషయమై చై మాట్లాడుతూ.. ‘తొమ్మిదో తరగతి చదివేటప్పుడు ఓ అమ్మాయిపై, నాకు, నా ఫ్రెండ్‌కు క్రష్‌ ఉండేది. అయితే ఆ అమ్మాయి మా హృదయాలను ముక్కలు చేయడంతో మేం ముగ్గురం మంచి ఫ్రెండ్స్‌గా మారిపోయామని’ నవ్వుతూ చెప్పుకొచ్చాడు చైతన్య.

ఇక థ్యాంక్యూ సినిమాలో నటించడానికి కారణమేంటన్న ప్రశ్నకు బదులిస్తూ.. ‘సందర్భానికి తగ్గట్టు ఫీలింగ్స్‌ ఎక్స్‌ప్రెస్‌ చేయాలనే విషయాన్ని ఈ ‘థ్యాంక్‌ యూ’ స్క్రిప్టు గుర్తుచేసింది. ఈ కథ విన్న వెంటనే నా జీవితంలో ప్రత్యేకమైన వ్యక్తులకు థ్యాంక్స్‌ చెప్పాలనిపించింది. ఆ ఫీలింగ్‌తోనే ఈ సినిమాలో నటించా’నని చెప్పుకొచ్చాడు. మరి బంగార్రాజు, లవ్‌ స్టోరీ వంటి బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్స్‌ అనంతరం చై నటిస్తోన్న ఈ చిత్రం ఆయన కెరీర్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!