Naga Chaitanya: అక్కినేని అందగాడితో మళ్లీ జత కట్టనున్న లైలా!.. దర్శకుడు ఎవరంటే..

'ఒక లైలా కోసం'అంటూ ఏడేళ్ల క్రితం ప్రేమికులుగా నటించి మెప్పించారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), పూజా హెగ్డే (Pooja Hegde) . రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది.

Naga Chaitanya: అక్కినేని అందగాడితో మళ్లీ జత కట్టనున్న లైలా!.. దర్శకుడు ఎవరంటే..
Naga Chaitanya

Updated on: Feb 17, 2022 | 4:33 PM

‘ఒక లైలా కోసం’అంటూ ఏడేళ్ల క్రితం ప్రేమికులుగా నటించి మెప్పించారు అక్కినేని నాగచైతన్య (Naga Chaitanya), పూజా హెగ్డే (Pooja Hegde) . రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం యువతను బాగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌ మరోసారి రిపీట్‌ కానుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. గ్యాంబ్లర్‌, మానాడు వంటి వైవిధ్యమైన చిత్రాలు తెరకెక్కించిన తమిళ డైరెక్టర్‌ వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా ఓ సినిమా రూపొందనుంది. ఇందులో బుట్టబొమ్మ పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ చిత్రం తెరకెక్కుతోంది. హీరోయిన్‌ కన్ఫర్మేషన్‌తో పాటు సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారట దర్శక నిర్మాతలు.

కాగా గతేడాది మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాలో అక్కినేని అఖిల్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకుంది పూజ. ప్రేమకథా చిత్రంగా వచ్చిన ఈ చిత్రం యువతను బాగానే ఆకట్టుకుంది. ప్రభాస్‌ తో కలిసి పూజ నటించిన ‘రాధేశ్యామ్‌’ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి, రామ్‌చరణ్‌ లతో కలిసి నటించిన ఆచార్య కూడా రిలీజ్‌కు సిద్ధంగానే ఉంది. కోలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ విజయ్‌తో స్ర్కీన్‌ షేర్‌ చేసుకున్న ‘బీస్ట్‌’ కూడా విడుదలకు ముస్తాబవుతోంది. ఇక సూపర్ స్టార్ మహేశ్ బాబు – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కబోతున్న సినిమాలోనూ ఆమెనే హీరోయిన్‌గా తీసుకున్నారు. హిందీలోనూ ఒక సినిమా రిలీజ్‌ కానుంది. ఇక చైతూ విషయానికొస్తే.. సంక్రాంతికి బంగర్రాజుతో సందడి చేశాడు. త్వరలోనే ‘థ్యాంక్యూ’ అంటూ మన ముందుకు రానున్నాడు. విక్రమ్‌ కె. కుమార్‌ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో రాశీఖన్నా, అవికాగోర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. దిల్‌ రాజు నిర్మాణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Also Read:Vijayawada: బెజవాడ నడిబొడ్డున ట్రాఫిక్ కష్టాలకు చెక్.. బెంజ్ సర్కిల్ సెకండ్ ఫ్లై ఓవర్ ప్రారంభం..

Indian Army: తీరంలో అలజడి..! యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు.. బాంబులు, తుపాకి మోతతో దద్దరిల్లిన ఆర్కే బీచ్… వైరల్ అవుతున్న ఫొటోస్..

American Woman: వైద్య చరిత్రలో మరో అద్భుతం.. స్టెమ్‌ సెల్స్‌తో.. ఎయిడ్స్‌ పూర్తిగా నయం..