- Telugu News Photo Gallery Indian Navy conducts war games practice in Visakhapatnam beach exclusive photos
Indian Navy: విశాఖ తీరంలో ఒళ్ళు గగుర్పొడిచే భారత నావికాదళ సాహస విన్యాసాలు..
ప్రశాంతమైన సాగరతీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తీరం వెంబడి వచ్చిన ఉగ్రవాదులు ఆయుధాలతో రెచ్చిపోయారు. కొంత మంది ప్రజలను బందీగా చేసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న నేవీ కమాండర్లు యుద్ధనౌకలు హెలికాప్టర్లతో తీరానికి చేరుకున్నారు. తీరంలో బాంబుల మోత మోగింది.
Updated on: Feb 17, 2022 | 5:11 PM

యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు.. బాంబులు, తుపాకి మోతతో దద్దరిల్లిన ఆర్కే బీచ్.. ధైర్య సాహసాలతో సత్తాచాటిన నేవీ కమాండర్లు.

ప్రశాంతమైన సాగరతీరంలో ఒక్కసారిగా అలజడి రేగింది. తీరం వెంబడి వచ్చిన ఉగ్రవాదులు ఆయుధాలతో రెచ్చిపోయారు.

కొంత మంది ప్రజలను బందీగా చేసుకునే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న నేవీ కమాండర్లు యుద్ధనౌకలు హెలికాప్టర్లతో తీరానికి చేరుకున్నారు.

తీరంలో బాంబుల మోత మోగింది. ఉగ్రవాదులను మట్టుబెట్టి బందిలను సురక్షితంగా దర్శించారు కమాండర్లు.

ఇదంతా నిజమే అనుకుంటున్నారా..? ఈనెల 21 న జరగబోయే ప్లీట్ రివ్యూ కి సంబంధించి రిహార్సల్స్ మాత్రమే.

విశాఖ సాగరతీరంలో నావికాదళ సన్నాహక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఆర్కే బీచ్ లో నేవి రిహార్సల్స్ నిర్వహించారు.

ఈనెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ, 25 నుంచి మిలన్ 2022 పేరుతో విన్యాసాలు జరగనున్నాయి.

పి ఎఫ్ ఆర్ లో 60 యుద్ధనౌక లతోపాటు సబ్ మెరైన్ లు, 50కిపైగా యుద్ధ విమానాలు హెలికాప్టర్లు పాల్గొంటాయి. 25 నుంచి జరగబోయే మిలన్ 2022 వివిధ దేశాల నావికాదళ విన్యాసాలు కొనసాగుతాయి.

ఈ కార్యక్రమాలకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ , సీఎం జగన్ హాజరవుతారు. పీఫ్ ఆర్ కోసం సన్నద్ధంలో భాగంగానే చేపట్టిన రిహార్సల్ అందర్నీ ఆకట్టుకున్నాయి.

ఆర్కే బీచ్ కు సందర్శకులంతా సాయంత్రానికి చేరుకున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతలో ఒక్కసారిగా సముద్రం వైపు నుంచి బాంబుల మోత మోగింది.

ఉగ్రవాదులు సాగర తీరం వైపు నుంచి వస్తు ఆయుధాలతో రెచ్చిపోయేలా కనిపించారు. కొంత మంది ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా బందీలుగా చేసుకునెందుకు యత్నింంచ్చారు.

ఈలోగా అలర్ట్ అయిన నావికా దళ కమాండర్ లు యుద్ధనౌకలు హెలికాప్టర్లతో రంగంలోకి దిగారు.

గగనతలంలో హెలికాప్టర్ లో చక్కర్లు కొట్టాయి. ఆపరేషన్లో భాగంగా నేవీ సిబ్బంది హెలికాప్టర్ల పైనుంచి దూకి సముద్రం లో దుకారు.

నేవీ కమాండర్ లో సముద్రంలోంచి భూమి ఉపరితలం పైకి అధునాతన స్పీడు బోట్లతో దూసుకొచ్చారు. బాంబుల, తుపాకుల మోత మోగింది. ఈలోగా ఉగ్రవాదులను కొంతమందిని మట్టుబెట్టారు.

మరికొంత మందిని అదుపులోకి తీసుకున్నారు నేవి కమాండర్లు. వారి నుంచి బందీలుగా ఉన్న ప్రజలను రక్షించే లా చర్యలు తీసుకున్నారు.

అయితే అప్పటికే భారీగా చేరుకున్న సందర్శకులు.. ఒక్కసారిగా జరిగిన పరిణామంతో అవాక్కయ్యారు. నేవీ సన్నాహక విన్యాసాలు అని తెలుసుకొని ఊపిరి పీల్చుకున్నారు.

ఒళ్లు గగుర్పాటు గురిచేసేలా చేసిన విన్యాసాలు చూసి ఎంజాయ్ చేశారు. సెల్ఫోన్లలో నావికా దళ కమాండర్ ల విన్యాసాలను బంధించారు. (Photo Courtesy: Khaja, Visakhapatnam, TV9 Telugu.)
