‘మహానాయకుడు’ పై నాదెండ్ల ఏమన్నారంటే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్స్ లో రూపొందిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ చిత్రం రిలీజ్ చేసి.. అందులో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వలేదు చిత్ర యూనిట్. ఇక రెండో పార్ట్ విషయానికి వస్తే రిలీజ్ చేసిన ట్రైలర్ లోనే మనకు స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ఇందులో నాదెండ్ల ను మెయిన్ విలన్ చేశారని తెలిసిపోయింది. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు ‘మహానాయకుడు’ వచ్చింది.  ఇది ఇలా […]

  • Ravi Kiran
  • Publish Date - 1:06 pm, Fri, 22 February 19
'మహానాయకుడు' పై నాదెండ్ల ఏమన్నారంటే..!

నందమూరి బాలకృష్ణ హీరోగా సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్స్ లో రూపొందిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ‘కథానాయకుడు’ చిత్రం రిలీజ్ చేసి.. అందులో ఎలాంటి వివాదాలకు తావు ఇవ్వలేదు చిత్ర యూనిట్. ఇక రెండో పార్ట్ విషయానికి వస్తే రిలీజ్ చేసిన ట్రైలర్ లోనే మనకు స్టోరీ ఎలా ఉండబోతోందో చెప్పేశారు. ఇందులో నాదెండ్ల ను మెయిన్ విలన్ చేశారని తెలిసిపోయింది. ఇక ఈ రోజు ప్రేక్షకుల ముందుకు ‘మహానాయకుడు’ వచ్చింది.

 ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ సినిమా షూటింగ్ సమయంలోనే నాదెండ్ల కు వ్యతిరేకంగా సీన్స్ ఉంటే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వారి కుటుంబ సభ్యులు చిత్ర యూనిట్ ను హెచ్చరించారు. ఆ సమయంలోనే సెన్సార్ బోర్డు కు ఫిర్యాదు చేయడంతో నిర్మాణ సంస్థకు నోటీసులు జారి చేశారట. అయితే తాజాగా ఈ విషయంపై నాదెండ్ల భాస్కర్ రావు మీడియాతో మాట్లాడారు.

ఆయన మాటల్లోనే..

మహానాయకుడు సినిమాలో నన్ను విలన్ గా చూపించే ప్రయత్నం చేశారు. నేను ఎవరికి వెన్నుపోటు పొడవలేదు. అసలు ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన వారిని వదిలేసి నన్ను విమర్శిస్తున్నారు. అందుకే ఈ సినిమాపై ముందు నుండే నా కుమారుడు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ నోటీసులు పంపించాడు. అసలు సెన్సార్ బోర్డు రూల్ ప్రకారం ఈ సినిమాను ముందుగా మాకు చూపించి.. ఆ తర్వాత రిలీజ్ చేయాలి. కానీ అందులో ఒక లేడి ఉందట. ఆమె ఎలా చెబితే.. అలా సెన్సార్ జరుగుతోందట. అందుకే ‘మహానాయకుడు’ సినిమా ఈజీగా సెన్సార్ అయింది. కాబట్టి ఇప్పుడు ఇక ఏమి చేయలేం. ప్రజలకు ఏది నిజం.. ఏది అబద్దం అనేది తెలుసు. అందుకే నేను లైట్ తీసుకున్నాను అని ఆయన అన్నారు.