ఆ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా..!

ఆ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ రాబోతోందా..!

జగపతి బాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ ఎస్.వి కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘శుభలగ్నం’. డబ్బు పిచ్చి పట్టిన ఒక మధ్యతరగతి ఇల్లాలు మొగుడు ని అమ్మేసి డబ్బు ని సొంతం చేసుకోవడం ఈ సినిమా కాన్సెప్ట్. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందట. ‘యాత్ర’ మూవీ నిర్మించిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని.. అలాగే కొత్త […]

Ravi Kiran

|

Feb 22, 2019 | 1:09 PM

జగపతి బాబు, ఆమని, రోజా ప్రధాన పాత్రల్లో డైరెక్టర్ ఎస్.వి కృష్ణారెడ్డి రూపొందించిన చిత్రం ‘శుభలగ్నం’. డబ్బు పిచ్చి పట్టిన ఒక మధ్యతరగతి ఇల్లాలు మొగుడు ని అమ్మేసి డబ్బు ని సొంతం చేసుకోవడం ఈ సినిమా కాన్సెప్ట్. అప్పట్లో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద హిట్ అయింది.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు సీక్వెల్ రూపొందనుందట. ‘యాత్ర’ మూవీ నిర్మించిన 70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారని.. అలాగే కొత్త దర్శకుడికి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నట్లు వినికిడి. ఇది ఇలా ఉంటే ఇందులో హీరోగా జగపతి బాబు ని తీసుకోవాలని అనుకుంటున్నారట.

ఇకపోతే హీరోగా కెరీర్ ముగిసిన తర్వాత జగపతి బాబు ప్రస్తుతం విలన్ గా పాపులర్ అయ్యాడు. ఆయన రెమ్యూనరేషన్ కూడా భారీగా పెరిగింది. ఈ సీక్వెల్ గురించి మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించనున్నారు చిత్ర యూనిట్.      

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu