మా నాన్న ఏం చేశాడో తెలుసా..!

‘‘మా నాన్న నా పేరును దొంగలించాడు’’ అంటూ ఫీల్ అవుతున్నాడు నేచురల్ స్టార్ నాని తనయుడు. ఈ మేరకు ఓ టీ షర్టును వేసుకొని తన నిరసనను వ్యక్తపరిచాడు జున్ను(తనయుడిని నాని పిల్చుకునే పేరు). అయితే దానికి ‘సారీ రా జున్ను తప్పలేదు’ అంటూ కామెంట్ పెట్టాడు నాని. Sorry ra Junnu …తప్పలేదు 😉 pic.twitter.com/z6RPybO7Ec — Nani (@NameisNani) April 18, 2019 కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ‘జెర్సీ’లో నటించిన విషయం […]

మా నాన్న ఏం చేశాడో తెలుసా..!
TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 18, 2019 | 11:22 AM

‘‘మా నాన్న నా పేరును దొంగలించాడు’’ అంటూ ఫీల్ అవుతున్నాడు నేచురల్ స్టార్ నాని తనయుడు. ఈ మేరకు ఓ టీ షర్టును వేసుకొని తన నిరసనను వ్యక్తపరిచాడు జున్ను(తనయుడిని నాని పిల్చుకునే పేరు). అయితే దానికి ‘సారీ రా జున్ను తప్పలేదు’ అంటూ కామెంట్ పెట్టాడు నాని.

కాగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ‘జెర్సీ’లో నటించిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నాని, అర్జున్ అనే పాత్రలో నటించాడు. ఇక నాని కుమారుడి పేరు కూడా అర్జున్ కాగా.. ‘మా నాన్న నా పేరును దొంగలించాడు’ అంటూ జున్ను తెలిపాడు. కాగా జెర్సీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీపై నాని చాలా ఆశలు పెట్టుకున్నాడు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu