మహేష్.. ‘మహర్షి’కి టాటా చెప్పేశాడు!
హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’ మూవీ షూటింగ్ రీసెంట్‌గా కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని మహేశ్.. ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘మహర్షి.. ఇట్స్ ఎ ర్యాప్’ అని కేక్‌పై రాసున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మిమ్మల్ని మే 9న థియేటర్లలో చూస్తాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవలే అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో తీసిన సాంగ్‌తో మూవీ షూట్ ర్యాప్ అప్ అయ్యింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ […]

హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటిస్తున్న ‘మహర్షి’ మూవీ షూటింగ్ రీసెంట్‌గా కంప్లీట్ అయ్యింది. ఈ విషయాన్ని మహేశ్.. ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ‘మహర్షి.. ఇట్స్ ఎ ర్యాప్’ అని కేక్‌పై రాసున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మిమ్మల్ని మే 9న థియేటర్లలో చూస్తాను’ అని క్యాప్షన్ ఇచ్చారు. ఇటీవలే అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో తీసిన సాంగ్‌తో మూవీ షూట్ ర్యాప్ అప్ అయ్యింది. వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మహేష్ సరసన్ హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిచింది. అల్లరి నరేష్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా… దిల్ రాజు, అశ్విని దత్, ప్రసాద్ వి పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలోని ‘ఎవరెస్ట్ అంచున’ అని సాగే పాట వీడియో ప్రివ్యూను శుక్రవారం సాయంత్రం 4.05 గంటలకు విడుదల చేయబోతున్నట్లు మూవీ యూనిట్ వెల్లడించింది. ‘మహర్షి’ తర్వాత మహేశ్ దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్న సినిమాలో నటించనున్నారు. దీంట్లో రష్మికా మందానా కథానాయిక.
View this post on InstagramWith this… It’s a wrap!!! See you in the cinemas on May 9th ??? #Maharshi #MaharshionMay9th