Murugadoss: వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకున్న మురుగదాస్.. ఏంటది.?
ఒకప్పుడు మురుగదాస్ అంటే తోపు డైరెక్టర్.. ఆయన కోసం చిరంజీవి సైతం వేచి చూసారు.. కానీ ఇప్పుడు సీన్ అంతా మారిపోయింది. వచ్చిన అవకాశాన్ని సైతం చేజేతులా పోగొట్టుకున్నారీయన. మరి ఈయన కెరీర్ పరిస్థితి ఏంటి..? సికిందర్ రిజల్ట్ మురుగదాస్ కంటే మరో హీరోను టెన్షన్ పెడుతుంది..? ఎవరాయన..? ఏంటి సంబంధం..?
Updated on: Apr 03, 2025 | 4:00 PM

ఏఆర్ మురుగదాస్.. ఒకప్పుడు ఈ పేరు ఒక బ్రాండ్. దీనా, గజిని, రమణ, తుపాకి, కత్తి లాంటి విజయాలతో తమిళ ఇండస్ట్రీని షేక్ చేసారీయన. తెలుగులోనూ స్టాలిన్‌తో పర్లేదనిపించారు.

అప్పట్లో రప్ఫాడించిన ఈ దర్శకుడు.. గత కొన్నేళ్లుగా స్థాయికి తగ్గ సినిమాలు చేయలేకపోతున్నారు. 2015లో వచ్చిన కత్తి తర్వాత.. ఇప్పటి వరకు మురుగదాస్ నుంచి బ్లాక్‌బస్టర్ రాలేదు.

తాజాగా మురుగదాస్ తెరకెక్కించిన సికిందర్ విడుదలైంది. సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ చిత్రానికి ఊహించిన రెస్పాన్స్ రావట్లేదు. ఔట్ డేటెడ్ కథతో.. వచ్చిన ఛాన్స్‌ని చేజేతులా మురుగదాస్ నాశనం చేసుకున్నారంటూ భాయ్ ఫ్యాన్స్ మండి పడుతున్నారు. రంజాన్ సీజన్‌లో వచ్చినా.. చాలా తక్కువ ఓపెనింగ్స్‌కే పరిమితమైంది సికిందర్.

సికిందర్ రిజల్ట్ మురుగదాస్ కంటే మరో హీరోను ఎక్కువగా కంగారు పెడుతుందిప్పుడు. అతడే శివకార్తికేయన్..! ఎందుకంటే ప్రస్తుతం తమిళంలో ఈ హీరోతో మదరాసి సినిమా చేస్తున్నారు మురుగదాస్. దాదాపు 100 కోట్లతో సినిమాను తెరకెక్కిస్తున్నారీయన. సికిందర్ ఎఫెక్ట్ తన సినిమాపై పడుతుందేమో అనే టెన్షన్ శివకార్తికేయన్‌కు మొదలైందిప్పుడు.

ఇప్పటికే విడుదలైన మదరాసి టీజర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. తుపాకి తరహాలోనే దీన్ని కూడా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తున్నారు మురుగదాస్. వరస ఫ్లాపుల్లో ఉన్న ఈ దర్శకుడి కెరీర్‌కు మదరాసి కీలకంగా మారింది. మరి చూడాలిక.. శివకార్తికేయన్ లక్‌తో అయినా.. మురుగదాస్ మళ్లీ ట్రాక్ ఎక్కుతారేమో..?





























