సుశాంత్ కేసు: ముంబయిపై మాజీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసు రాజకీయంగానూ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసును సీబీకి అప్పగించాలంటూ పలువురు రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు

సుశాంత్ కేసు: ముంబయిపై మాజీ సీఎం భార్య సంచలన వ్యాఖ్యలు
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 04, 2020 | 1:46 PM

Sushant Singh Case Updates: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ కేసు రాజకీయంగానూ హాట్‌టాపిక్‌గా మారింది. ఈ కేసును సీబీకి అప్పగించాలంటూ పలువురు రాజకీయ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఈ కేసులో ఓ మంత్రి కుమారుడు ఉన్నాడంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో సుశాంత్ కేసుపై ట్వీట్ చేసిన మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవీస్‌ ముంబయి నగరంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబయి తన మానవత్వాన్ని కోల్పోయిందని, ఇది ఎంతమాత్రం సురక్షితం కాదని ఆమె వ్యాఖ్యానించారు.

సుశాంత్‌ కేసులో ముంబయి పోలీసులు వ్యవహరిస్తోన్న తీరు చూస్తే ఈ నగరం మానవత్వం కోల్పోయినట్లు అనిపిస్తోంది. ఇక్కడ అమాయక ప్రజలు, ఆత్మగౌరవం ఉన్న వారు జీవించడం ఎంతమాత్రం సురక్షితం కాదు అని అమృతా ఫడ్నవీస్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా మరోవైపు దేవేంద్ర ఫడ్నవీస్ సైతం ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్‌లో కామెంట్లు చేశారు.

Read This Story Also: తెలంగాణ పల్లెల్లో కరోనా టెర్రర్‌.. 1500 గ్రామాలకు సోకిన కరోనా!