క్రిష్ 4తో కృతిసనన్ వచ్చేస్తోంది…!

ఇక కరోనా వైరస్ గోల లేకపోయి ఉంటే సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎదో ఒక స్పెషల్ అప్డేట్ ని ఇచ్చేవారట. అయితే సోషల్ మీడియాలో ఓ రోల్ అవుతోంది. తన తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆయన నాలుగు పాత్రల్లో కనిస్తారనే...

క్రిష్ 4తో కృతిసనన్ వచ్చేస్తోంది...!

Kriti Sanon Joins Hrithik Roshan on The Cast of Krrish 4? : బాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసిన క్రిష్ 1,2,3, అదే సీక్వెల్‌గా రాబోతోంది.  బాలీవుడ్ నుంచి రానున్న అత్యంత బిగ్ బడ్జెట్ సినిమాలలో క్రిష్ 4 ఒకటి. మొదటి మూడు సినిమాలకు ఏ స్థాయిలో క్రేజ్ దక్కిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హృతిక్ రోషన్ కథానాయకుడిగా రూపొందుతున్న క్రిష్ 4 ఈ సారి హాలీవుడ్ ని ఆకర్షించే విదంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమా 2020 డిసెంబర్ లో రిలీజ్ కానున్నట్లు దర్శకుడు రాకేష్ రోషన్ 2018లోనే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక కరోనా వైరస్ గోల లేకపోయి ఉంటే సినిమా ప్రాజెక్ట్ కి సంబంధించిన ఎదో ఒక స్పెషల్ అప్డేట్ ని ఇచ్చేవారట. అయితే సోషల్ మీడియాలో ఓ రోల్ అవుతోంది.

తన తండ్రి రాకేష్ రోషన్ తెరకెక్కించనున్న ఈ చిత్రంలో ఆయన నాలుగు పాత్రల్లో కనిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. స్కిప్టు పనులు ఇప్పటికే మొదలు పెట్టినట్టు రాకేష్ రోషన్ చెప్పిన సంగతి తెలిసిందే.
తాజాగా ఈ సినిమాలో హృతిక్ సరసన నటించబోయే హీరోయిన్‌పై నెట్టింట్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఇందులో కృతిసనన్ నటించబోతున్నట్టు బాలీవుడ్ సినీ నగర్ జోరుగా షికారు చేస్తోంది. దీనికి సంబంధించిన కృతితో ఒప్సందం కుదిరిందట. క్రిష్ సిరీస్ చిత్రాల్లో హృతిక్కు జోడీగా నటించిన ప్రియాంక ఇప్పుడు హాలీవుడ్
ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రియాంకను ఈ కొత్త చిత్రంలో నటింపచేయడం అంత సులువుకాదని
చిత్రబృందం భావించిందట.

Click on your DTH Provider to Add TV9 Telugu