అమరావతి రైతుల మానవహారం

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలపినప్పటికీ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్ట్‌ను ఆశ్రయించింది. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ ఉండడం‌తో సీడ్ ఆక్సిస్ రోడ్‌పై రైతులు, రైతు కూలీలు ఇరువైపులా నిలబడి నిరసన వ్యక్తం చేశారు.

అమరావతి రైతుల మానవహారం
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 04, 2020 | 12:17 PM

పరిపాలన వికేంద్రీకరణ బిల్లు అమరావతి రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది. సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్ ఆమోదం తెలపినప్పటికీ రాజధాని రైతు పరిరక్షణ సమితి హైకోర్ట్‌ను ఆశ్రయించింది. దీనిపై ఇవాళ కోర్టులో విచారణ ఉండడం‌తో సీడ్ ఆక్సిస్ రోడ్‌పై రైతులు, రైతు కూలీలు ఇరువైపులా నిలబడి నిరసన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు, న్యాయవాదులు అమరావతిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. వెంకటపాలెం, ఉద్దండరాయని పాలెం, తాళ్లాయపాలెం, మందడం, వెలగపూడి, లింగాయపాలెం, రాయపూడి, తుళ్ళూరుకు చెందిన రైతులు రైతు కూలీలు ఈ ఆందోళనలో పాల్గొన్నరు. హైకోర్టుకు వెళ్లే మార్గం మొత్తం రైతులు మానవహారంగా నిలబడి నిలరసన వ్యక్తం చేశారు.